YS Jagan: పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయితే వారికి వీక్లీ ఆఫ్ లు: జగన్
హోంగార్డుల భర్తీలో రిజర్వేషన్ కల్పించడానికి శ్రీకారం చుడుతున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమ ప్రభుత్వం పోలీస్ శాఖలోనే 16వేల మహిళా పోలీసులను నియమించినట్లు చెప్పారు.
దిశ యాప్, దిశా పోలీస్టే స్టేషన్లు, ప్రాసిక్యూటర్లను ప్రతి నియమించామని చెప్పిన సీఎం జగన్.. మహిళలు, చిన్నపిల్లలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవాలని సందేశం ఇచ్చారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ ఏపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
పోలీసులకు త్వరలోనే వీక్లీ ఆఫ్ లు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు.
గత సంవత్సర కాలంలో ఏపీ నుంచి విధి నిర్వహణలో పదకొండు మంది పోలీసులు అమరులయ్యారని ప్రకటించారు.
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, 6,511 పోలీస్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామన్నారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు.
పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయితే వారికి వీక్లీ ఆఫ్ లు ప్రారంభిస్తామని చెప్పారు. పోలీసుల సేవలు ప్రజలకు ఎంతో అవసరమని, ఉద్యోగాల భర్తీతో వీక్లీ ఆఫ్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు సీఎం జగన్.
రాష్ట్రంలో కీలకమైన హోం శాఖకు మహిళలు, దళితులను మంత్రులుగా నియమించి వారికి ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందన్నారు. (All Images Credit: Twitter/@AndhraPradeshCM)