Pawan Kalyan: ప్రజల కోసం జనసేనాని- కాన్వాయ్ ఆపి, కుర్చీలు వేసుకొని ప్రజల సమస్యలు విన్న పవన్ కళ్యాణ్
ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ తొలిసారిగా ప్రసంగించారు. అసెంబ్లీ గత ప్రభుత్వం లాగ కాకుండా, శాంతియుత వాతావరణంలో, వ్యక్తిగత దూషణలు లేకుండా జరగాలని జనసేనాని వ్యాఖ్యానించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని శనివారం (జూన్ 22న) మధ్యాహ్నం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు.
తనపై ఎంతో నమ్మకంతో తమ సమస్యల పరిష్కారం కోసం, తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని పవన్ కళ్యాణ్ గమనించారు. వెంటనే పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ ఆపి తన ఆఫీసు ముందు కూర్చీలు వేసుకుని ప్రజలతో మాట్లాడారు. 3
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జనవాణి నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అందులో కొన్ని అర్జీలపై అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
తొలిరోజు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ అయ్యన్నను అభినందిస్తూ సభ్యులు ప్రసంగించాక అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి.
సమావేశాలు ముగించుకుని వెళ్తున్న పవన్ కళ్యాణ్ తనను కలిసేందుకు వచ్చిన వారికి సమయం కేటాయించి నిబద్ధత చాటుకున్నారు. గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జనవాణి నిర్వహించి బాధితుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటికి పరిష్కారం ఏంటని సైతం వారిని అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యపై మాట్లాడారు.
యువత, వృద్ధులు, దివ్యాంగులు అనే వ్యత్యాసం లేకుండా అంతా పవన్ కళ్యాణ్ తమ సమస్యలను తీర్చుతానని నమ్మకం ఉంచి రావడం విశేషం.
ఏపీలో పలు ప్రాంతాల్లో పర్యటించిన పవన్.. ఆ సమయంలో ప్రజల కష్టాలు, కన్నీళ్లు దగ్గర్నుంచి చూశానని అందుకే వారికి దగ్గరై సమస్యలు తీర్చే శాఖలు తీసుకున్నట్లు ఆయన స్వయంగా తెలిపారు.