Telangana News: జాబ్ క్యాలండర్ కోసం బీజేపీ నేతల ధర్నా- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి యత్నం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు టీచర్ పోస్టులు పెంచడమే కాకుండా జాబ్ క్యాలండర్‌ను కూడా విడుదల చేయాలని BJPYM నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగ్రూప్ వన్ ప్రిలిమ్స్‌లో 1:100 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని బీజేపీ నేతల డిమాండ్ చేస్తున్నారు. ఈ మరేకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవనాన్ని ముట్టడించారు.
గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని బీజేపీ యువమోర్చ నాయకులు ఆందోళన చేపట్టారు.
25 వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీని నిర్వహించాలని, జాబ్ క్యాలండర్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ నినాదాలుచేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవన్ ఎదుట ధర్నా చేసిన చేస్తూ బిజెవైఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.