Vijayawada Floods: వరద సహాయ చర్యలపై సీఎం సమీక్ష- అర్థరాత్రి వేళ విజయవాడలో పర్యటన
భారీ వర్షాలకు, వరదలకు విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. నీట మునిగిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రజలకు అందుతున్న సాయం, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు
మోకాళ్లు లోతు వరద నీటిలోనే పర్యటించిన చంద్రబాబు.. వరద బాధితులను పరామర్శించారు.
వరద బాధితులతో మాట్లాడి వారి సాదకబాదకాలు తెలుసుకున్నారు. అధికారులు వచ్చారా లేదా ఆరా తీశారు.
ప్రభుత్వం అండగా ఉంటుందని ఎలాంటి ఇబ్బంది పడొద్దని ధైర్యం కోల్పోవద్దని వారి భరోసా ఇచ్చారు చంద్రబాబు
వరద బాధిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ చర్యలపై కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జోరు వానలో కూడా సీఎం చంద్రబాబు పర్యటన సాగింది. ఉదయం పూట బోటులో తిరిగిన చంద్రబాబు... రాత్రి మాత్రం నడిచే బాధితుల వద్దకు చేరుకున్నారు.
ఇంకా వరద ముంచెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి చేపట్టాల్సిన సహాయక చర్యలను తీసుకోవాలని అధికారులను చంద్రబాబు సూచించారు.
అవసరమైతే అక్కడి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
సమస్యలు ఉంటే మాత్రం అధికారులకు వెంటనే తెలియజేయాలని సీఎం చంద్రబాబు బాధితులకు సూచించారు.