Tirumala Brahmotsavam 2024: సర్వభూపాల వాహనంపై శ్రీ కాళీయ మర్ధనుడి అలంకారంలో మలయప్పస్వామి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
భూపాలుడు అంటే రాజు. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, దక్షిణానికి యముడు, ఉత్తరానికి కుబేరుడు, నైరుతికి నిరృతి, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు.
ఈ అష్టదిక్పాలకులు స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి మనం అర్థం చేసుకోవాలి
ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, యముడు, కుబేరుడు, నిరృతి, పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా వ్యవహరిస్తారు. వీరు స్వామివారి భారాన్ని మోస్తూ, భక్తితో ఎలా ఉండాలో భక్తులకు నేర్పుతారు.
శ్రీవారి సర్వభూపాల వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. తిరుమల మాడవీధులు భక్తులతో కిక్కిరిసిపోగా, గోవింద నామస్మరణతో ఏడు కొండలు ప్రతిధ్వనిస్తున్నాయి.