In Pics: కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు - ఫోటోలు, ప్రత్యేకత ఏంటంటే
ABP Desam
Updated at:
30 Sep 2022 12:53 PM (IST)
1
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి శ్రీ రాజమన్నార్ అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు.
3
క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వ జన్మస్మరణ కూడా కలుగుతుంది.
4
ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది.
5
అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు.
6
ఇక రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామి వారు భక్తులకు అభయమిస్తారు.