In Pics: తిరుమలలో ఎవరికీ దక్కని మహ భాగ్యం ఈయనకు, 23 ఏళ్లుగా అదే పనిలో
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుపతికి చెందిన ఈ వ్యక్తి మాత్రం స్వామి వారిపై అపారమైన భక్తి భావంతో దాదాపు 25 ఏళ్ళుగా బ్రహ్మోత్సవాలకు వాడే పరదాలను తయారు చేస్తూ శ్రీ వేంకటేశ్వరుడి సేవకు అంకితం అయ్యారు.
వృత్తినే ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తిగా, ఓ సాదా సీదా టైలర్ అయిన పరదాల మణి సాక్షాత్తు వైకుంఠనాధుడుకే పరదాలను సమర్పించే మహద్భాగ్యాన్ని సంపాదించాడు.
1999లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో హుండీ ఏర్పాటు చేసేందుకు మొదటి సారి అవకాశం దక్కింది. అక్కడి ఆలయానికి అనుగుణంగా హుండీని బట్టలతో తయారు చేసారు మణి. అలా అక్కడి అధికారుల మన్నలను పొందాడు.
తర్వాత శ్రీవారి ఆలయంలో పరదాలు కుట్టేందుకు టీటీడీ అధికారుల నుండి మణికి పిలుపు వచ్చింది.
ఆనాటి నుండి నేటి వరకూ ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంకు ముందు రోజు నాడు తయారు చేసినా పరదాలను టీటీడీకి అందిస్తున్నాడు.
23 ఏళ్లుగా స్వామి వారి ఆలయానికి పరదాలు, కురాలాలు సమర్పిస్తూ పరదాల మణిగా పేరు పొందాడు.
స్వామి వారి గర్భాలయంలో ఉన్న జయవిజయ ద్వారా పాలకుల ద్వారం వద్ద గరుడ వాహన భూషితుడైన శ్రీ వేంకటేశ్వరుడు, కామధేనువు, పరధాలపై భాగంలో శ్రీ పద్మావతి, లక్ష్మీదేవి అమ్మవార్లు, శ్రీవారి తిరునామంతో ఎంతో విశేషంగా ఆ పరదాలను రూపొందించారు.
ఎన్నో జన్మల పుణ్య ఫలంతోనే స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని, తన ప్రాణం ఉన్నంత వరకూ స్వామి వారి సేవలోనే గడుపుతానని పరదాల మణి ఏబీపీ దేశంతో అన్నారు..