Tirumala Photos: అశ్వ వాహన సేవలో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు.
అశ్వ వాహన సేవలో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీర్వాదాలు పొందారు.
అశ్వ వాహనంను అధిరోహించిన మలయప్ప స్వామి వారికి తిరుమాఢ వీధిలో భక్తులు కర్పూర హారతులు సమర్పించారు.
ఈ చక్ర స్నాన మహోత్సవంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొంటున్నారు..
బుధవారం రాత్రి ధ్వజావరోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
అశ్వ వాహనంను అధిరోహించిన మలయప్ప స్వామి వారికి తిరుమాఢ వీధిలో భక్తులు కర్పూర హారతులు పలికారు.
అశ్వ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి వారి దర్శన భాగ్యంతో తిరుమాడ వీధులు గోవింద నామస్మరణలతో మారుమోగాయి.
అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.