Vaikunta Dwara Darshanam: అల 'వైకుంఠ'వాసుని వైకుంఠ ద్వార దర్శనం - చూసిన కనులకు మహాభాగ్యం, ఇల వైకుంఠ శోభను చూశారా?
తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ఏకాదశి శోభను సంతరించుకుంది. పుష్పాలు, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅభిషేక సేవ అనంతరం ఉదయం 3:45 గంటల నుంచే అధికారులు భక్తులను దర్శనానికి అనుమతించారు. ప్రోటోకాల్ ప్రముఖులకు అనుకున్న సమయం కంటే ముందే స్వామి దర్శనం కల్పించారు.
టోకెన్ ఉన్న భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ కుటుంబంతో సహా స్వామిని దర్శించుకున్నారు. ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు అనిత, పార్థసారథి, సవిత, రామానాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆలయం వెలుపల విద్యుత్ దీపాలంకరణ వైకుంఠ శోభను తలపించింది. విద్యుత్ దీపాల అలంకరణలో శ్రీవారి ఆలయం ఇల వైకుంఠమే అన్నట్లుగా మారింది.
విద్యుత్ దీపాలంకరణలతో పాటు బెంగుళూరు నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఆలయం, వైకుంఠ ద్వారం సహా అంతరాలయం వెలుపల ప్రత్యేక పుష్పాల అలంకరణలు అద్భుతాన్ని ఆవిష్కరించాయి.
ఆలయం వెలుపల పుష్పాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పుష్పాల అలంకరణతో పాటు విద్యుత్ దీపాల వెలుగులతో శ్రీవారి ఆలయం మరింత శోభను సంతరించుకుంది.
ఆలయం వెలుపల వివిధ రకాల పుష్పాలు, పండ్లతో ఏర్పాటు చేసిన వైకుంఠంలో శ్రీమహావిష్ణువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీన్ని చూసిన భక్తులు మురిసిపోతున్నారు. అభిషేకం అనంతరం స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పించారు.
ఆలయం వెలుపల పుష్పాలతో ప్రత్యేక వైకుంఠం అబ్బుర పరుస్తోంది. నిజంగా వైకుంఠమే ఇలకు దిగి వచ్చిందా అన్న రీతిలో దీన్ని తీర్చిదిద్దారు.
పుష్పాల మధ్య అమ్మవారితో స్వామి వారి దర్శనం చేసుకున్న భక్తులు తరిస్తున్నారు. ఇది నిజంగా వైకుంఠ దర్శనమే అంటూ మురిసిపోతున్నారు.
స్వామి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలిరాగా.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తిరుమల ఆలయం వెలుపల సుందరంగా పుష్పాలతో అలంకరించారు. ఈ ఆకృతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. నిజంగా ఇల వైకుంఠమే అనిపించేలా అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయం పుష్పాలంకరణలో మెరిసిపోతోంది. భిన్న రకాల్లో ఆలయాల రూపంలో చేసిన ఆకృతులు ఆకట్టుకున్నాయి.
శుక్రవారం ఉదయం స్వామి వారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ పర్వదినం రోజున శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రంథంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
వైకుంఠ ఏకాదశి దర్శనం సందర్భంగా 3 రోజులు పుష్పాలంకరణతో పాటు విద్యుత్ దీపాల అలంకరణ భక్తులను అలరించనుంది. పుష్పాల మధ్య శ్రీనివాసుని దర్శనం భక్తులకు మరో అనుభూతిని కలిగిస్తోంది.