Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Pawan Kalyan: కాకినాడలో పవన్ కల్యాణ్ పంద్రాగస్టు వేడుకలు- కుమార్తె ఆద్యతతో సెల్ఫీ దిగిన ఫొటో వైరల్
కాకినాడలో జరిగిన 78వ స్వాతంత్ర్యదినోత్సవంలో పాల్గొన్నారు డిప్యూటీసీ సీఎం పవన్ కల్యాణ్. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు , యువకుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాకినాడ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వంధనం స్వీకరించారు.
కాకినాడలో పంద్రాగస్టు వేడుకల్లో మాట్లాడిన పవన్ కల్యాణ్... నియంతృత్య పోకడలు, జాతీ సంపదను దోచుకుని ప్రజలను నిర్లక్ష్యం చేసే పాలకులను ఎప్పుడూ ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.
సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికి షణ్ముఖ వ్యూహంతో ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పటికే 28 రకాల సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు.
ప్రజల శ్రేయస్సు కోసం డొక్కా సీతమ్మ పేరుతో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని, అన్న క్యాంటీలను అమలు చేస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. అదే టైంలో రాష్ట్రాభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొన్నారు.
పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు పవన్ కల్యాణ్. సర్పంచులకు అధికారాలు, సాతంత్య్ర, గణ దినోత్సవాల నిర్వహణకి కూడా నిధుల పెంచుతామని తెలిపారు. మైనర్ పంచాయతీలకు పది వేలు, మేజర్ పంచాయతీకు రూ. 25 వేలు అందిస్తామన్నారు.
ప్రజా సంపద కొల్లగొట్టిన వారెవర్నీ విడిచిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఐదేళ్లుగా శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆర్థిక వ్యవస్థ అస్తవ్స్థమైందన్నారు. అడవుల్లో కొట్టేసిన ఎర్రచందనం కర్ణాటకలో అమ్ముకున్నారన్నారన్నారు.
అసలు గత పాలకు చేసిన అక్రమాల వల్ల పాలనలో ఎలా ముందుకెళ్లాలో అనే పరిస్థితి ఏర్పడిందని అయినా శక్తిని కూడదీసుకొని వెళ్తున్నట్టు తెలిపారు.
ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేశామని ఇంకా అమలు చేస్తామని తెలిపారు పవన్ కల్యాణ్
తాను డిప్యూటీసీఎంను కాబట్టి తన పరిధిలో కొన్ని చెప్పలేనని కచ్చితంగా ప్రజలు సంతోషపడే పాలనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు.
పవన్ కల్యాణ్ రావడంతో కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు.
కాకినాడలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో కుమార్తెతో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమార్తె ఆద్యతతో దిగిన సెల్ఫీ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.