Upasana: ఇంకా అనాగరిక ప్రపంచంలోనే ఉన్నాం..ఎలాంటి స్వాతంత్య్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం - ఉపాసన ఆవేదన!
ఆగస్టు 15 వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జెండావందన కార్యక్రమాల్లో పాల్గొన్నారంతా.ఇలాంటి సమయంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో హెల్త్ ఎమ్.డి అయిన ఉపాసన కొణిదెల వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా అనాగరిక ప్రపంచంలోనే ఉన్నాం అంటూ ఆవేదనవ్యక్తం చేశారు. కోల్ కతాలో వైద్యురాలి హత్యాచార ఘటన తనను ఎంతగానో కలచివేసిందంటూ ఉపాసన ఈ వ్యాఖ్యలు చేశారు
సమాజంలో అనాగరికత ఇంకా కొనసాగుతుంటే....ఎలాంటి స్వాతంత్య్రాన్ని మనం జరుపుకుంటున్నాం అని ప్రశ్నించారు ఉపాసన
దేశ ఆరోగ్య సంరక్షణకు వెన్నెముక మహిళలు..ఎక్కువమంది స్త్రీలను వర్క్ ఫోర్స్ లోకి తీసుకురావాలనే లక్ష్యం బలపడిన సమయంలో స్త్రీలకు భద్రత, గౌరవం దక్కేందుకు కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు ఉపాసన.
అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్, అపోలో యువర్లైఫ్ వైస్-ఛైర్ పర్సన్, అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ , ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్-టిపిఎ లిమిటెడ్ వ్యవస్థాపకురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఉపాసన. మరోవైపు ఆరోగ్యం - ఫిట్ నెస్ కు సంబంధించిన సమాచారాన్ని అందించే హెల్త్ కేర్ - వెల్ నెస్ వెబ్ సైట్ బి పాజిటివ్ కి కూడా ఆమె యజమాని.
ఉపాసన కామినేని (Image credit:upasanakaminenikonidela /Instagram)