In Pics: మేకపాటి చివరి పర్యటన ఇదే, దుబాయ్‌లో ప్రముఖులతో - ఏకంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లుగా వైద్యులు సోమవారం ఉదయం ధ్రువీకరించారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం ఆయన వయసు 49 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
మేకపాటి వారం రోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన ఇండియన్ ఎక్స్ పోకి వెళ్లారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తున్నామని, మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
దుబాయ్ ఎక్స్‌పోలో 12 థీమ్‌లతో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ప్రారంభించారు. దుబాయ్ ఎక్స్ పోలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులతో వరుసగా సమావేశం అయ్యారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
టెక్ మార్క్ కంపెనీ, అలానా గ్రూప్ , ఐబీపీసీ, ఎన్ వెంట్, కూ,రెగల్ ట్రేడర్స్,నికయ్ గ్రూప్,ఈఎస్పీఏ కంపెనీల ఛైర్మన్, ఎండీలు, ప్రతినిధులతో పెట్టుబడులకు సంబంధించి చర్చించారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
దుబాయ్ పర్యటనలో మూడు ఎంవోయూలను కుదుర్చుకున్నారు. లండన్ కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.3వేల కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్నారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
రీటైల్ వ్యాపారంలో గ్రాంట్ హైపర్ మార్కెట్ బ్రాండ్ నేమ్ తో 25 సంవత్సరాలుగా సత్తా చాటుతున్న రీజెన్సీ గ్రూప్ తో జీ2బీ(గవర్నమెంట్ టు బిజినెస్) ఒప్పందం, రూ.150 కోట్ల విలువైన 25 రీటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు రీజెన్సీ గ్రూప్ ఎంవోయూ కుదుర్చుకుంది. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో మరో కీలక ఒప్పందం చేసుకున్నారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
గౌతమ్ రెడ్డి వారం రోజుల పర్యటన తర్వాత ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
అదే రోజు రాత్రి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో హుటా హుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ కన్నుమూశారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
పెట్టుబడుల కోసం దుబాయ్ వెళ్లిన మంత్రి.. తిరిగి ఏపీకి వెళ్లకుండానే కన్నుమూయడం తీవ్రమైన విషాదాన్ని నింపింది. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
మేకపాటి గౌతం రెడ్డికి రాజకీయాల్లో చాలా మృదుస్వభావిగా మంచి పేరుంది. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
ప్రత్యర్థి పార్టీల వారు ఎంతగా రెచ్చగొట్టేలా మాట్లాడినా మేకపాటి మాత్రం సున్నితంగా స్పందించేవారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
మేకపాటి గౌతం రెడ్డి చనిపోయిన వార్తను తెలుసుకొని వైసీపీ శ్రేణులు దిగ్భ్రాంతి చెందారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
దుబాయి పర్యటనకు వెళ్లిన మంత్రి గౌతమ్‌రెడ్డి.. రేపు విజయవాడ రావాల్సి ఉంది. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
సీఎం వైఎస్ జగన్‌తో భేటీకి రేపు (ఫిబ్రవరి 22) మంత్రి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)
దుబాయి పర్యటన వివరాలను సీఎంకు వివరించడానికి ఈ అపాయింట్ మెంట్ తీసుకున్నారు. Photo Credit: (Twitter/Mekapati Gowtham Reddy Official)