Mekapati Goutham Reddy: బిజినెస్ నుంచి పాలిటిక్స్‌కు వచ్చి మేకపాటి గౌతమ్ రెడ్డి సక్సెస్, మీకు ఈ విషయాలు తెలుసా
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. దుబాయ్ నుంచి భారత్‌కు నిన్ననే తిరిగొచ్చిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రికి గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఒక్కసారిగా పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
1971 నవంబర్ 2న మేకపాటి గౌతమ్‌రెడ్డి జన్మించారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి
గౌతమ్ రెడ్డి ఐర్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తిచేశారు.
2014 అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీచేసి గెలుపొందారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఆత్మకూరు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ జగన్ కేబినెట్లో ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రిగా చేస్తున్నారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డికి భార్య శ్రీకీర్తి, కుమార్తె అన్యన్యరెడ్డి ఉన్నారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టి అందరం ఎదుగుదామంటూ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తూ “యూ గ్రో వి గ్రో” అనే నినాదాన్ని మంత్రి మేకపాటి ఇచ్చారు.
వారం రోజుల దుబాయ్ పర్యటన ముగించుకొని గౌతమ్ రెడ్డి నిన్ననే దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చారు. గుండెపోటుతో హైదరాబాద్ లో అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. పోస్ట్ కొవిద్ పరిణామాలే గుండెపోటుకు కారణం కావచ్చని భావిస్తున్నారు.