Srivari Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - పెద్ద శేషవాహనంపై మలయప్ప స్వామి
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. ఉత్సవాల్లో తొలి రోజు పెద్ద శేష వాహనంపై శ్రీవారు వి.హరించారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.
అశేష భక్త జన సందోహం మధ్య గోవింద నామస్మరణతో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన వాహన సేవ రాత్రి 11 గంటల వరకూ సాగనుంది. ఈ సేవలో సీఎం చంద్రబాబు దంపతులు, ఈవో శ్యామలరావు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బ్రహ్మోత్సవాల తొలిరోజు సీఎం చంద్రబాబు దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం టీటీడీ డైరీలను విడుదల చేశారు.
టీటీడీ - 2025 క్యాలెండర్ రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు