In Pics: సగటు కూలీలా పని చేస్తా, పెద్దన్న పాత్రను తీసుకుంటా: పవన్ - ఫోటోలు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజక వర్గం అచ్యుతాపురంలో పవన్ కల్యాణ్ వారాహి విజయ భేరీ సభ నిర్వహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకునే ఛాన్సు ఇది. ఒక్కసారి ఛాన్సు అడిగిన పాలకుడు ఎన్ని దాష్టీకాలు చేశాడో మీకు తెలుసు. మరోసారి అదే తప్పు జరగకుండా చూసుకోండి

నేను సంపూర్ణంగా ప్రజల కోసం పని చేస్తా. మీరు ఎన్నుకున్నవారితో పని చేయించే బాధ్యత తీసుకుంటాను. పోలవరం పునరావాస బాధితులకు ఎంత అండగా నిలబడతానో, సెజ్ లలో భూములు కోల్పోయి నష్టపోయిన రైతులకీ అంతే అండగా నిలబడి న్యాయం చేస్తాను.
ప్రజల ఆస్తులన్నీ కాజేసే కుట్రతో తీసుకొచ్చిన జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు అంశాన్ని ఇప్పుడు వైసీపీ నాయకులు కేంద్రం మీదకు తోసి చేతులు దులుపుకుందామనే కొత్త పన్నాగం పన్నారు.
ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, దానికి సంబంధించి డిజిటల్ కార్డుల పంపిణీ అనేది దేశంలోనే ఓ ఆరోగ్య విప్లవం అవుతుంది.
దీనికి ప్రతి ఏటా ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. దీంతో పేదలకు పూర్తి స్థాయి ఆరోగ్య భరోసా లభిస్తుంది. దీంతోపాటు మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేల సాయం, 10 మందికి ఉపాధినిచ్చే స్టార్టప్, చిన్న పరిశ్రమలకు రూ.10 లక్షల రాయితీ ఇవ్వడం అనేది యువతను ఎంటర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దుతుంది
అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉపాధి కోసం కూటమి కట్టుబడి ఉంది. ఉపాధి జోన్లను ఏర్పాటు చేసి, స్థానికంగా ఉండే ఉద్యోగాలను యువతకు అందేలా చేస్తాం. దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేని విధంగా యువత నైపుణ్య గణాంకాలపై సర్వే చేస్తాం. యువ శక్తి ఆలోచనలు, వారు ఏం కావాలనుకుంటున్నారు..
గడగడపకు కార్యక్రమంలో ఓ విద్యార్థి ఎమ్మెల్యే కన్నబాబురాజును ఫీజు రియంబర్సుమెంటు రాలేదని అడిగితే ఆ విద్యార్థిని చావబాదారు. ఈ ఎమ్మెల్యే సింహాచలం ఆలయ భూములను ఇష్టానుసారం ఆక్రమించి భవంతులు కడుతున్నారు.
ప్రజల కోసం, యువత కోసం ఓ సగటు కూలీలా పని చేస్తాను. వారికి నిరంతరం అందుబాటులో ఉండే పెద్దన్న పాత్రను తీసుకుంటాను. చాలా మంది కోరుకుంటున్నట్లు సీఎం పదవి అనేది కాలం నిర్ణయిస్తుంది. అప్పటివరకు నా డ్యూటీ నేను నిజాయతీగా నిర్వహిస్తాను. ప్రజల కోసం, ప్రజల్లో ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా ముందు వరుసలో నిలబడే సేవకుడిని అవుతాను’’ అని పవన్ కల్యాణ్ మాట్లాడారు.