Pawan Kalyan In Kurnool: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో పవన్ కళ్యాణ్‌కు ఘనస్వాగతం, అటునుంచి శిరివెళ్లలో రచ్చబండకు జనసేనాని
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓర్వకల్లులోని విమానాశ్రయానికి చేరుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅక్కడి నుంచి రచ్చబండ కార్యక్రమం కోసం ఆళ్లగడ్డ నియోజకవర్గం, శిరివెళ్ళ గ్రామానికి బయలుదేరారు.
మార్గం మధ్యలో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి, పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయం అందచేస్తారు.
అంతకు ముందు జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు చింతా సురేష్, రేఖా గౌడ్, హసీనా బేగం, అర్షద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, అనంతపురం జిల్లా నాయకుడు పెండ్యాల హరి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా శిరివెళ్ళ బయలుదేరారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు జనసైన రైతు భరోసా కింద రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నారు.
ఇదివరకే అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబసభ్యులకు సైతం రూ.1 లక్ష ఆర్థికసాయం అందించారు.