✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

In Pics : తిరుమలలో శోభాయ‌మానంగా కోదండరాముడి పుష్పయాగం

ABP Desam   |  07 May 2022 09:45 PM (IST)
1

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శ‌నివారం పుష్పయాగ మహోత్సవం శోభాయ‌మానంగా జరిగింది. ఆలయంలో మార్చి ‌30 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే.

2

వార్షిక బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

3

ఈ సందర్భంగా ఉదయం 10 నుంచి 11 గంటల వ‌ర‌కు స్వామి, అమ్మవారి ఉత్సవ‌ర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

4

స్వామి, అమ్మవారి ఉత్సవ‌ర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు.

5

త‌మిళ‌నాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌ రాష్ట్రాల నుంచి పుష్పాలు విరాళంగా అందాయి

6

పుష్పయాగాన్ని తిలకిస్తున్న భక్తులు

7

మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వ‌ర‌కు ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం శాస్త్రోక్తంగా జ‌రిగింది.

8

తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 11 రకాల పుష్పాలు, ఐదు రకాల ప‌త్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామి, అమ్మవార్లకు పుష్ప యాగం నిర్వహించారు.

9

త‌మిళ‌నాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌ రాష్ట్రాల నుంచి పుష్పాలు విరాళంగా అందాయి. మొదటగా అర్చకులు 108 సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవున్ని ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం.

10

తిరుమలలో శోభాయ‌మానం కోదండరాముడికి పుష్పయాగం

11

తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 11 రకాల పుష్పాలు, ఐదు రకాల ప‌త్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామి, అమ్మవార్లకు పుష్ప యాగం నిర్వహించారు.

12

పుష్పయాగం అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆంధ్రప్రదేశ్
  • In Pics : తిరుమలలో శోభాయ‌మానంగా కోదండరాముడి పుష్పయాగం
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.