In Pics : కన్నుల పండుగా ఒంటిమిట్ట రాములోరి కల్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
ఒంటిమిట్ట సీతారాముల కల్యాణంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున స్వామి వారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
అర్చకులు ముఖ్యమంత్రికి తలపాగా కట్టి పళ్లెంలో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు. సీఎం వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో అర్చకులకు అందించి స్వామి వారిని దర్శించుకున్నారు
ఒంటిమిట్ట కోదండరామ దేవాలయంలో సీఎం జగన్
సీఎం జగన్ వెంట మంత్రి రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లిఖార్జున రెడ్డి, అధికారులు ఉన్నారు
సీఎం జగన్ కు శేషవస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు స్వామివారి తీర్థప్రసాదాలు, ఒంటిమిట్ట రాములవారి చిత్రపటం అందజేశారు
ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
కోదండ రామునికి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ
ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు.
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శుక్రవారం ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్న ఈ కానుకలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆలయానికి అందజేశారు.
ఒంటిమిట్ట ఆలయానికి శ్రీవారి కానుకలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆలయానికి అందజేశారు.
ఆలయం ఎదుట ఆభరణాలు, పట్టు వస్త్రాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వీటిని ఛైర్మన్ దంపతులు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్లి అర్చకులకు అందజేశారు.
ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు
కోదండరామాలయంలోని మూల మూర్తికి ఒకటి, ఉత్సవ మూర్తులకు మూడు కిరీటాలు శ్రీవారి ఆలయం నుంచి వచ్చాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలను దర్శించి, సీతారాముల పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు.
ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం
సీతారాముల కల్యాణంలో పాల్గొన్న సీఎం జగన్
ఒంటిమిట్ట సీతారామ కల్యాణోత్సవం
కోదండరాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణంలో సీఎం జగన్
వైభవంగా సీతారాముల కల్యాణ ఘట్టం
ఒంటిమిట్ల కోదండరాముడి బ్రహ్మోత్సవాలు
సీతారాముల కల్యాణోత్సవం
సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్త జనం
సీతారాముల కల్యాణ వేదిక
సీఎం జగన్