Pawan Kalyan: మా అన్న చిరంజీవి జోలికొస్తే ఊరుకునేది లేదు: వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు త్వరలో ఎన్నికలు ఉన్నందున జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు తెలపడంపై సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రజా రాజ్యం పార్టీని అమ్మేసిన వ్యక్తి అసలు స్వరూపం ఏంటో తెలిసిందంటూ విమర్శించారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. చిరంజీవి అజాత శత్రువు అని, ఆయన జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు.
మూడు రాజధానులు అని వైసీపీ, జగన్ చెప్పగానే చిరంజీవి మద్దతు తెలిపారని.. అలాంటి సమయంలో కూడా తాను జగన్ పై ఒక్క కామెంట్ చేయలేదన్నారు. కానీ నేడు చిరంజీవి తనకు నచ్చిన అభ్యర్థులకు మద్దతు తెలిపితే సిగ్గు లేకుండా ఆయనను వైసీపీ విమర్శించిందన్నారు.
కులాల వారీగా ప్రజలను సీఎం జగన్ విడగొట్టే కొద్దీ తాను ఏకం చేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ సింహం కాదని, ఒంటరి అసలే కాదని.. గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని ఎద్దేవా చేశారు.
అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని, గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా మీ అభిమానంతో తట్టుకుని నిలబడ్డా అన్నారు పవన్ కళ్యాణ్.
కూటమి అధికారంలోకి రాగానే ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకి నీరు.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. మత్స్యకారులకు ఉపాధి, ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తామన్నారు జనసేనాని.