In Pics: ఎన్నికల తర్వాత తొలిసారి కుప్పంకు చంద్రబాబు - ప్రజల్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం
కుప్పం నియోజకవర్గంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన మంగళవారం జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆయన రాకతోనే ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
ఈ పర్యటనకు ముందు శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించి మధ్యాహ్నం 2.53 గంటలకు కుప్పంకు సీఎం బయలుదేరారు.
అక్కడ హంద్రీ నీవా కాలువ పనులు గురించి వివరించిన ఎస్ఈ చంద్రబాబుకు వివరించారు.
సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు.
రెండు రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది.
మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
సీఎం పర్యటనకు ఉండే సెక్యూరిటీకి పూర్తి భిన్నంగా.. చంద్రబాబు టూర్ సాగుతోంది.
పోలీసులు, ప్రత్యేక భద్రతా సిబ్బంది లేకుండా చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.
బాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన వచ్చిన బస్సు వద్దకు వచ్చి చంద్రబాబుకు అభినందనలు తెలుపుతున్నారు.
ప్రజలు, కార్యకర్తలతో మమేకం అవుతూ చంద్రబాబు తన పర్యటనను కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎనిమిదిసార్లు కుప్పం నుంచి గెలిచానని అన్నారు.
తాను కుప్పానికి వచ్చినా, రాకున్నా ప్రజలు ఆదరించారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించారని.. అహంకారంతో విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరని ప్రజలు మరోసారి నిరూపించారని అన్నారు.
సీఎం అయిన వెంటనే పోలవరం, అమరావతి వెళ్లానని.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేముందు మీ ఆశీస్సుల కోసమే కుప్పం వచ్చానని చంద్రబాబు అన్నారు.
రాబోయే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని.. కుప్పాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
వైసీపీ పాలన పీడ కల అని.. అలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.
వైసీపీ దౌర్జన్యాలను ప్రజలు అసహ్యించుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను తిరగరాయబోతున్నామని వెల్లడించారు.
కుప్పం ప్రశాంతమైన చోటు అని.. ఇక్కడ హింసకు చోటులేదని అన్నారు. కుప్పంలో రౌడీయిజం చేసేవారికి అదే ఆఖరి రోజు.. జాగ్రత్త.. అంటూ హెచ్చరించారు.
కుప్పంలో ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు సిమెంట్ రోడ్లు వేయిస్తామని.. కుప్పంలోని 4 మండల కేంద్రాలను ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.
image 21