Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - ఈ ఫోటోలు చూశారా!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యామ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి. జనసేన ఎమ్మెల్యేలకు శాసనసభా వ్యవహారాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవారాహి అమ్మవారి దీక్షలో భాగంగా 11 రోజుల పాటు ఆయన కఠిన నియమాలు పాటించనున్నారు. దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు.
గతేడాది విజయ యాత్ర పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన.. అప్పుడు కూడా దీక్ష చేపట్టారు.
జనసేన ఎమ్మెల్యేలకు శాసనసభా వ్యవహారాలకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న ఫోటోలు వైరల్గా మారాయి. 11 రోజుల పాటు కఠిన నిబంధనలతో జనసేనాని దీక్ష చేపట్టనున్నారు.