Rahul Gandhi in Kadapa: వైఎస్సార్ పాదయాత్ర నాకు ఆదర్శం, చెల్లి షర్మిలను గెలిపించండి: కడప సభలో రాహుల్ గాంధీ
రాజకీయాల్లో కుటుంబ సంబంధాలు ఉంటాయని, తన తండ్రి రాజీవ్ గాంధీకి సోదరుడు YSR అని.. ఈ బంధం చాలా ఏళ్ళ నుంచే ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. CBI ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ YSR పేరును చేర్చలేదని స్పష్టం చేశారు. కడపలో నిర్వహించిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App- YSR బిడ్డ నా చెల్లెలు షర్మిల ఇవ్వాళ మీ ముందు నిలబడింది, ఆమె పార్లమెంట్ లో ఉండాలి. YSR సైద్ధాంతిక విలువలు షర్మిల లో ఉన్నాయి. నా చెల్లెలి తరుపున ఏపి ప్రజల వాగ్ధానం అడుగుతున్నాను.. వైఎస్ షర్మిలను పార్లమెంట్ కు పంపితే ఏపీ ప్రజల ఆలోచనలు ఢిల్లీలో వినపడాలన్నారు.
YSR దేశానికి మార్గదర్శకుడు, ఆయన పాదయాత్ర తనకు ఆదర్శమన్నారు రాహుల్ గాంధీ. YSR తనకు దేశం మొత్తం పాదయాత్ర చేయాలని చెప్పారని, అన్ని విషయాల్లో మార్గదర్శకుడు అన్నారు. పాదయాత్ర చేస్తే ప్రజల్లోకి వెళ్తాం అని YSR చెప్పారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుస్తాయి. భారత్ జోడో ద్వారా దేశంలో ఎన్నో వీదులు తిరిగాను. వైఎస్సార్ సామాజిక న్యాయం కోసం రాజకీయం చేశారని, - ఇప్పుడు ఏపీలో అది లేదన్నారు.
వైఎస్సార్ ఢిల్లీలో ఏపీ హక్కులపై పోరాటం చేసేవారు. నేడు ఏపీని బీజేపీ B టీమ్ నడిపిస్తుంది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని.. ఈ ముగ్గురి రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోదీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. మోదీ చేతిలో CBI, ED ఉన్నాయన్న కారణంగా వీళ్ళు చెప్పు చేతల్లో ఉన్నారని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
YSR సిద్ధాంతం, కాంగ్రెస్ సిద్ధాంతం బీజేపీ కి వ్యతిరేకం. వైఎస్ జగన్ మాత్రం బీజేపీ కి మద్దతుగా ఉన్నారు. బీజేపీని జగన్ ఒక్క మాట అనరు ఎందుకంటే అవినీతి బయట పడుతుందని భయం అన్నారు. ఇదే భయం చంద్రబాబుకి ఉందని.. అందుకే ఢిల్లీలో వీళ్లు పోరాటం చేయలేరని విమర్శించారు. ప్రత్యేక హోదా వచ్చిందా ? పోలవరం కట్టారా ? కడప స్టీల్ కట్టారా ? ఇచ్చిన వాగ్దానాలను ఒక్కటి అమలు చేయలేదు. పైగా బీజేపీ ముందు ఏపీ ఆత్మ గౌరవం తలదించుకొని ఉందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం ప్రాజెక్టు కడతాం, కడప స్టీల్ ప్లాంట్ కడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. KG TO PG ఉచిత విద్య అమలు. నిరుపేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తాం. 2.25లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతి కుటుంబం నుంచి ఒక పేద మహిళను ఎంపిక చేసి, ఆమె బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు ఏడాదికి ఇస్తామన్నారు.
రైతులకు కనీస మద్దతు ధర, ప్రతి ఏడాది 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి హామీ పథకాన్ని 400 కి పెంచుతాం అన్నారు. మోడీ రాజ్యాంగాన్ని నాశనం చేసి, తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని రాహుల్ గాంధీ ఆరోపించారు.