Riddhi Kumar: లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న 'లవర్' బ్యూటీ రిద్ది కుమార్
Riddhi Kumar Latest Photos: రిద్ది కుమార్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'లవర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మహారాష్ట్ర పుణేలో జన్మిచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆమె తల్లిదండ్రులది కేరళ నేపథ్య కుటుంబం. పుణేలో పుట్టి పెరిగిన రిద్ది ఫిలాసఫీ లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ వెంటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తున్న రిద్ది కుమార్ ప్రభాస్-పూజా హెగ్డే రాధేశ్యామ్‌లో ఓ కీలక పాత్రలో మెరిసింది. ట్రైయిన్‌లో పరిచయమైన ఆర్చరీ ప్లేయర్‌గా కనిపించింది రిద్ది.
హిందీలో పలు వెబ్ సిరీస్, సీరియల్లో నటించి ఈమే లవర్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘అనగనగా ఓ ప్రేమకథ’ చిత్రంలో నటించింది.
అలా తెలుగులో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ నార్త్, సౌత్‌లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంది. మరోవైపు ఈమే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా లండన్ వెకేషన్‌లో ఉన్న ఈ అమ్మడు అక్కడి ఫోటోలు షేర్ చేసింది.
లండన్ ట్రావెల్ నేషనల్ ఆర్ట్ గ్యాలరీ వద్ద సెల్ఫీలు తీసుకున్న ఈ బ్యూటీ ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం రిద్ది కుమార్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.