Maha Yagam: పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మహా యాగం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరగడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూ కల్తీ ద్వారా చేసిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన నేత, ఏపీ ఆహార, పౌరసరఫరాల, వినియోగదారుల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ మహా యాగం నిర్వహించారు. తెనాలిలోని వైకుంఠపురం దేవాలయంలో సెప్టెంబర్ 23న ఉదయం 11 గం. నుంచి మహా యాగం చేశారు.
యాగం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. కానీ అందులో కూడా కల్తీ జరుగుతుందని మనం కలలో కూడా ఊహించలేదన్నారు.
తిరుమల లడ్డూలో కల్తీ జరగడం ప్రతి భక్తుడిని ఆవేదనకు గురిచేసిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా యాగం నిర్వహించినట్లు తెలిపారు.
దైవానికి ఎవరి వల్ల అపచారం జరిగినా, అందరూ పశ్చాత్తాపంతో ఉండాలని.. అందరి క్షేమం కోసం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంకల్పించారని నాదెండ్ల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఎమ్మెల్యేలు, నేతలు ఆలయాల్లో ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.