Loneliness Side Effects : ఒంటరితనంతో ప్రాణాంతక సమస్యలు.. వామ్మో అంత డేంజరా?
ఒంటరితనం శారీరక, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభాలాను చూపిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. అయితే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో.. శారీరకంగా వచ్చే దీర్ఘకాలిక సమస్యలేంటో చూసేద్దాం. (Image Source : AI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఒంటరితనం వల్ల కలిగే దీర్ఘకాలిక వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఒంటరితనం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుందట. దీని గురించి యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ జర్నల్ రాశారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందట. (Image Source : AI)
ఒంటరితనం వల్ల అభిజ్ఞా శక్తి క్షీణత వస్తుందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ జెరియాట్రిక్ సైకియాట్రీలో రాశారు. ఒంటరితనం, సామాజిక ఒంటరితనం వల్ల జ్ఞాపకశక్తి తగ్గి.. అల్జీమర్స్ వచ్చే అవకాశం పెరుగుతుందట. (Image Source : AI)
ఎక్కువకాలం ఒంటరిగా ఉంటే.. వృద్ధాప్య ప్రక్రియ వేగంగా వచ్చేస్తుందట. స్మోక్ చేసేవారికంటే దీనివల్లే త్వరగా ముసలివారు అవుతారట. వృద్ధాప్యం అనేది మానసిక, సామాజిక స్థితిపై ఆధారపడి ఉంటుందట. ఒంటరిగా ఉంటూ సంతోషంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. (Image Source : AI)
ఒంటరితనం హృదయ ఆరోగ్యానికి అంత మంచిది కాదట. మానసికంగానూ.. శారీరకంగానూ.. కృంగ దీసి.. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. దీనిగురించి బ్రిటీష్ మెడికల్ జర్నల్లో ఆన్లైన్లో ప్రచురించారు. (Image Source : AI)
ఒంటరితనం అంటే ఒక్కరే ఉండడం కాదు. నలుగురిలో ఉన్నా.. ఒంటరిగా ఫీల్ అవ్వడమే. ఇలా ఎక్కువ రోజులు ఉంటే కచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. (Image Source : AI)
అందుకే మీకు క్లోజ్ అనిపించే వ్యక్తితో కొన్ని విషయాలు షేర్ చేసుకోండి. లేదంటే ఒంటరితనానికి బలైపోవాల్సి వస్తుందని గుర్తించుకోండి.(Image Source : AI)