Menstruation Medicine Complications : పీరియడ్ పెయిన్‌కి మెడిసిన్ తీసుకుంటే చనిపోతారా? షాకింగ్ విషయాలు ఇవే
ప్రతి అమ్మాయి పీరియడ్ సమయంలో నొప్పిని, క్రాంప్స్‌ని ఎదుర్కొంటుంది. ఇది ఒక్కోక్కరి శరీరతత్వం బట్టి ఉంటుంది. ఆసమయంలో నొప్పిని కంట్రోల్ చేసుకునేందుకు మెడిసిన్ తీసుకుంటారు. మీరు కూడా అలానే మెడిసిన్ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త.(Image Source: Pinterest,Pexel)
తమిళనాడులోని ఓ 18 ఏళ్ల యువతి పీరియడ్ పెయిన్ ఎక్కువగా ఉండడంతో పెయిన్ కిల్లర్ తీసుకుందట. వాటిని ఓవర్ డోస్‌లో తీసుకోవడంతో ఆమె చనిపోయినట్లు తేలింది. ఇవి నిజంగానే అంత ప్రమాదకరమా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?(Image Source: Pinterest,Pexel)
పీరియడ్స్ సమయంలో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యని పెయిన్ కిల్లర్స్ తీవ్రం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో డయేరియా, మలబద్ధకం కూడా ఇబ్బంది పెడతాయి. ఈ సమస్యలు బ్లీడింగ్‌ను తీవ్రం కూడా చేస్తాయి. (Image Source: Pinterest,Pexel)
పెయిన్ కిల్లర్స్ ఏవైనా ఎక్కువగా తీసుకుంటే లివర్, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అలాగే పీరియడ్స్ సమయంలో ఈ పెయిన్ కిల్లర్స్ కూడా ఇదే ప్రభావాన్ని చూపిస్తాయంటున్నారు నిపుణులు. (Image Source: Pinterest,Pexel)
గుండె సమస్యలను ఈ పెయిన్ కిల్లర్స్ పెంచుతాయట. కొన్నిసందర్భాల్లో హార్ట్ ఎటాక్ కూడా సంభవిచ్చొచ్చని నిపుణులు చెప్తున్నారు. బీపీ కూడా పెరుగుతుంది. (Image Source: Pinterest,Pexel)
పెయిన్ కిల్లర్స్‌ని పీరియడ్ సమయంలో ఎప్పుడో ఒకసారి తీసుకుంటే మంచిదే కానీ.. రెగ్యూలర్‌గా ఓవర్ డోస్ తీసుకుంటే కచ్చితంగా ప్రాణాంతకమే అంటున్నారు నిపుణులు. (Image Source: Pinterest,Pexel)
సహజమైన పద్ధుతుల్లో పీరియడ్ పెయిన్‌ని తగ్గించుకోగలిగే టిప్స్‌ని ఫాలో అయితే బెటర్ అంటున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే వైద్యుల సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.(Image Source: Pinterest,Pexel)
ఇవి అన్నీ కేవలం అవగాహన కోసమే. సహజమైన లేదా మెడికల్ సపోర్ట్ కోసం నిపుణులు లేదా వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది.(Image Source: Pinterest,Pexel)