In Pics: గళమెత్తిన ఉపాధ్యాయులు... కదంతొక్కి కలెక్టరేట్ల ముట్టడి
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు కలెక్టరేట్ల ముట్టడి చేసి పీఆర్సీపై ఆందోళన చేపట్టాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకడప కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ఉద్యోగ సంఘాలు విఫలయత్నం చేశాయి. ఈ టైంలోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ముళ్ళ కంచె బారికేడ్లు తోసుకోని లోనికి చోరబడే యత్నం చేశారు ఉద్యోగులు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి భారీగా హాజరైన ఉపాధ్యాయులు.
అనంతపురం జిల్లాలో కలెక్టరేట్ వద్దలో ఆందోళన సాగిస్తున్న వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవే దృశ్యాలు. ఒంగోల్, కాకినాడ ఎక్కడ చూసినా ఇదే పోరాటం.
కృష్ణా,గుంటూరు కలెక్టరేట్ల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను దగా చేసిందంటూ పెద్ద ఎత్తున ఉద్యోగులు నినాదాలు చేశారు. ఫిట్మెంట్ విషయంపై ప్రభుత్వం పునరలోచించాలని రిక్వస్ట్ చేశారు. చీకటి జివోలు1,2,8,9ను వెంటనే రద్దు చేయాలన్నారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్సీ లక్ష్మణరావును పోలీసులు అరెస్టు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుందుకు ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 80 ఫీట్ రోడ్డు, సంతోషి మాతా గుడి, అరసవల్లి మీదుగా కలెక్టరేట్ కు చేరుకునే మార్గాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ఓ దశలో పోలీసులకు ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఇలాంటి పరిస్థితి ఊహించిన పోలీసులు ముందుగానే జిల్లా ఎన్జీఓ నేతలను అదుపు లోకి తీసుకున్నారు.
కడప కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ఉద్యోగ సంఘాలు విఫలయత్నం చేశాయి. ఈ టైంలోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ముళ్ళ కంచె బారికేడ్లు తోసుకోని లోనికి చోరబడే యత్నం చేశారు ఉద్యోగులు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. పోలీసులు భారీ ఎత్తున మొహరించినా కలెక్టరేట్లోకి ఉద్యోగులు చొచ్చుకెళ్లారు