Pawan Kalyan: కొండగట్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - కొండంత అభిమానం, ఈ ఫోటోలు చూశారా!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొండగట్టు దర్శనానికి బయలుదేరారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొండగట్టుకు చేరుకుంటున్న సందర్భంగా దారి పొడవునా ఆయనకు జనసైనికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాన్వాయ్ ఆపిన ఆయన వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
సిద్ధిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద పవన్ కల్యాణ్‌కు జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గజమాలతో సత్కరించారు.
పవన్ కల్యాణ్‌కు జనసేన నేతలు, అభిమానులు వీర ఖడ్గాన్ని బహుకరించగా దాన్ని ఎత్తి చూపారు.
పవన్‌ను చూసేందుకు వచ్చిన ప్రజలు, అభిమానులతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
కొండగట్టు అంజన్న ఆలయంలో పవన్ కల్యాణ్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
వేద పండితులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం మధ్య పవన్ ఆలయంలో ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లారు.
ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పవన్‌కు వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.
ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజల అనంతరం పవన్ కల్యాణ్‌కు తీర్థ ప్రసాదాలు అందించారు.
అనంతరం పవన్ కల్యాణ్‌కు కొండగట్టు అంజన్న చిత్రపటాన్ని బహూకరించారు.
అంజన్న దర్శనం అనంతరం ఆలయం ప్రాంగణంలో అభిమానులకు పవన్ అభివాదం చేస్తూ తిరుగు పయనమయ్యారు.