Sri Satya Birthday: శ్రీ సత్య బర్త్ డే... చికెన్ - హీరో రామ్ అంటే ప్రాణం - తెలుగమ్మాయి జీవితంలో ఈ విషయాలు తెల్సా?
శ్రీ సత్య... విజయవాడ అమ్మాయి. ప్రేక్షకుల్లో కొందరికి 'బిగ్ బాస్' సీజన్ 6 ద్వారా తెలుసు. మరికొందరికి షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ సిరీస్ ద్వారా తెలుసు. ఇంకొంత మందికి 'జీ తెలుగు' సూపర్ క్వీన్ షో ద్వారా తెలుగు. ప్రజెంట్ 'ఢీ సెలబ్రిటీ స్పెషల్' సీజన్ 2లో ఒక టీమ్ లీడర్. జూన్ 29న ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆవిడ జీవితంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీ సత్య అందాల పోటీల్లో పాల్గొన్నారు. 'మిస్ ఫొటోజెనిక్ 2016' టైటిల్ విన్నర్. ఆ తర్వాత కొన్ని సీరియళ్లు చేశారు. తర్వాత రియాలిటీ షోస్ కూడా చేశారు. ఆమెది విజయవాడ.
శ్రీ సత్యది ఫెయిల్యూర్, బ్యాడ్ లవ్ స్టోరీ. ప్రేమించిన వాడి చేతిలో మోసపోయిన ఆవిడ... ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అది చూసిన తల్లి మానసికంగా ఎంతో కుంగిపోయింది. అమ్మ ట్రీట్మెంట్ కోసం నెలలో 30 రోజులు సీరియళ్ళలో నటించిన రోజులు ఉన్నాయి. ఎంబీబీస్ చేయాలని అనుకున్నా బీబీఎం చేసింది.
'ముద్ద మందారం', 'త్రినయని', 'నిన్నే పెళ్లాడతా' సీరియళ్లు చేసిన శ్రీ సత్యకు హీరో రామ్ అంటే క్రష్. ఒకసారి అతడికి 'ఐ లవ్ యు' అని మెసేజ్ చేస్తే బ్లాక్ చేశాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
శ్రీ సత్యకు చికెన్ అంటే ప్రాణం. చికెన్ ఇస్తే అసలు తినకుండా వదిలిపెట్టదు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ బిజీ అవుతోంది.
మెహబూబ్ సరసన ఇటీవల శ్రీ సత్య ఒక మ్యూజిక్ వీడియో చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అది విడుదల అయ్యింది. ఇంకా మరికొన్ని మ్యూజిక్ వీడియోస్ చేశారు.