In Pics: చంద్రబాబుకు రాఖీ కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు
రాఖీ పూర్ణిమ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలువురు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బ్రహ్మకుమారీలతో పాటు, టీడీపీ మహిళా నేతలు సీఎంకు రాఖీలు కట్టారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాఖీ పండుగ సందర్భంగా ఉండవల్లి నివాసంలో చంద్రబాబును వీరు కలిశారు. టీడీపీ మహిళా నేతలు, మాజీ మంత్రి పీతల సుజాత, జడ్పీ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా అంగన్ వాడీ విభాగం ప్రెసిడెంట్ ఆచంట సునీత, కంభంపాటి శిరీష కూడా చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.
పలువురు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. సీఎం వారికి ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మహిళలను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు.
తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే.
తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే. మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషిచేశాం. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తూ... ఈ ‘రక్షాబంధన్’ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అన్నివేళలా, అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను’’ అని పోస్ట్ చేశారు.