Ram Chandra Yadav: నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల చేసిన రామచంద్ర యాదవ్, రైతులకు గుడ్న్యూస్
జధాని పరిరక్షణ కోసం తాను మంగళగిరి నుండి పోటీ చేస్తున్నట్లు భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తెలిపారు. ఆయన తన సొంత నియోజకవర్గం పుంగనూరుతో వైసీపీలో కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన, ఇటు మంగళగిరిలో నారా లోకేష్ పైనా పోటీకి దిగుతున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంగళరిగిలోని హ్యాపీ రిసార్ట్స్ నందు నియోజకవర్గంలోని అభిమానులు, కార్యకర్తలు, ప్రతినిధులతో రామచంద్ర యాదవ్ శనివారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ అటు పుంగనూరులో, ఇటు మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నారు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు (వైసీపీ, టీడీపీ) సమదూరమని చెప్పారు.
వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న పెద్దిరెడ్డిపై, ఇటు టీడీపీలో నెంబర్ 2 గా ఉన్న నారా లోకేష్ పై బరిలో దిగినట్లు రామచంద్రయాదవ్ తెలిపారు. అంతే కాకుండా సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. రాజధాని పరిరక్షణ కోసం మంగళగిరి నుండి బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. ఖచ్చితంగా రెండు నియోజకవర్గాల నుండి విజయం సాధించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.
మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తి స్థాయి ప్రణాళికతో ఉన్నట్లు తెలిపారు రామచంద్ర యాదవ్. ఇందు కోసం నియోజకవర్గ మేనిఫెస్టోను రామచంద్ర యాదవ్ విడుదల చేశారు. నియోజకవర్గంలోని ప్రతి రైతుకి ఒక ఆవు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.