In Pics: ఏపీలో దిశ వెహికిల్స్ ప్రారంభం, జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్
ఏపీలో మహిళలు, చిన్నారులకు భద్రత ఇచ్చే ఉద్దేశంతో కొత్తగా 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీటిని బుధవారం (మార్చి 23) అసెంబ్లీ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు.
సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 1.16 కోట్ల మంది అక్కా చెల్లెమ్మలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని అన్నారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదని.. ఇప్పటికే దిశ పోలీస్స్టేషన్లలో 900 ద్విచక్ర వాహనాలున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు పటిష్ఠమైన భద్రతను కల్పించడంలో భాగంగా క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం కోసం విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగుపరచడం కోసం పెట్రోలింగ్ ను ప్రారంభించింది.
ఈ వాహనాలన్ని జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుండి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగా ప్రత్యేక GPS ట్రాకింగ్ వ్యవస్థతో కూడి ఉంటుంది.
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడానికి ఈ పెట్రోలింగ్ వాహనాలు జనసంచారం తక్కువ ఉన్న సమస్యాత్మక ప్రాంతాలలో నేరం జరిగేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రదేశాలలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయి.
ప్రస్తుతం ఉన్న 900 ద్విచక్ర వాహనాలు, 163 ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్ వాహనాలతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సత్వర ప్రతిస్పందన కోసం 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 పోలీస్ యూనిట్లలో ఏర్పాటు చేసిన దిశ కంట్రోల్ రూంతో పాటు పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూంకి అనుసంధానించారు.
మహిళలు తమ మొబైల్ ఫోన్ లో దిశ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా, అనంతరం ఏదైనా సమస్యను ఉత్పన్నమైనప్పుడు తమ చేతిలోని SOS లేదా మొబైల్ ను షేక్ చేయడం ద్వారా బాధితుల వద్దకు పోలీసులు చేరుకుంటారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రతిస్పందన సమయం 4-5 నిమిషాలు అదే గ్రామీణ ప్రాంతాల్లో 8-10 నిమిషాలకు తగ్గింది.
ఈ ప్రతిస్పందన సమయం మరింత తక్కువగా ఉండడానికి ఈ ప్రత్యేక వాహనాలు తోడ్పడనున్నాయి.
ఇప్పటికే దిశ మొబైల్ అప్లికేషన్‌ను కోటి పదహారు లక్షల మంది మహిళలు తమ మొబైల్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవడం మన అందరికి తెలిసిందే.