In Pics: ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - బాధ్యతలు తీసుకున్న జనసేనాని, వెంటనే రంగంలోకి
ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి పథకం, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కొణిదల పవన్ కళ్యాణ్ బుధవారం (జూన్ 19) విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపార్టీ కార్యాలయం నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి చేరుకొని.. అక్కడ వేద పండితులు శాస్త్రోక్తంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
కార్యాలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనం తీసుకున్న అనంతరం ఉదయం 10.30 నిమిషాలకు బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. అనంతరం ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసే ఫైల్ మీద తొలి సంతకం చేశారు.
రెండో సంతకం గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం కోసం చేశారు. పి.ఆర్. అండ్ ఆర్.డి. ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కన్నబాబు, అటవీ శాఖ పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి సోదరులు శ్రీ నాగబాబు గారు ఆయన వెంట ఉన్నారు.
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో శాఖాపరమైన విధుల్లో నిమగ్నమయ్యారు. తొలుత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సమీక్షలు నిర్వహించారు.
బాధ్యతలు తీసుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో పాటు మొత్తం జనసేన ఎమ్మెల్యేలు అందరూ ఈ సందర్భంగా పాల్గొన్నారు.