Tirumala Jyestabhishekam 2024: తిరుమలలో 3 రోజుల పాటూ జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు!
మొదటిరోజు ఉత్సవమూర్తులకు హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి, అమ్మవార్లకు వజ్రకవచాన్ని అలంకరించి మాడవీధుల్లో ఊరేగిస్తారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజ్యేష్ఠాభిషేకంలో రెండో రోజు స్వామి అమ్మవార్లకు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడోరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు.
జ్యేష్టాభిషేకం సందర్భంగా ఆలయంలో జూన్21వ తేదీ కల్యాణోత్సవ, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి మూల విగ్రహాన్ని, ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామిని జ్యేష్ఠాభిషేకం జరిగే మూడు రోజులలో దర్శించుకుంటే వైకుంఠానికి చేరుకుంటారని భక్తుల నమ్మకం..
ఈ ఉత్సవాల కారణంగా ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. తోమాలసేవ, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
తిరుమలలో 3 రోజుల పాటూ జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు!
తిరుమలలో 3 రోజుల పాటూ జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు!