YS Jagan In Vinukonda: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి, ఢిల్లీ వేదికగా పోరాటం - రషీద్ కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం జగన్
పల్నాడు జిల్లా వినుకొండలో రెండు రోజుల కిందట నడిరోడ్డుపై రషీద్ అనే యువకుడు దారుణహత్యకు గురవడం తెలిసిందే.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైఎస్సార్ సీపీ యూత్ విభాగం నేత రషీద్ కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం నాడు రోడ్డు మార్గాన వినుకొండకు చేరుకున్నారు జగన్.
రషీద్ ఫొటోకు వైఎస్ జగన్ నివాళులర్పించారు. దారుణహత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. రషీద్ కుటుంబసభ్యులను ఆయన ఓదార్చారు.
రషీద్ హత్యపై అతడి తల్లిదండ్రులు జగన్ వద్ద అనుమానాలు వ్యక్తం చేశారు. రాజకీయ కక్షల కారణంగానే హత్య జరిగితే, వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందని పోలీసులు చెబుతున్నారని జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
టీడీపీ నేతలతో జిలానీ ఉన్న ఫొటోలను రషీద్ కుటుంబ సభ్యులు జగన్కు చూపించారు. హత్య వెనుక ఎవరున్నా విడిచిపేట్టే ప్రసక్తేలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జులై 24న పార్టీ ప్రతినిధులతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని, పోలీసుల సమక్షంలో దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. 46 రోజుల పాలనలో 36 రాజకీయ హత్యలు జరిగాయని, 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయన్నారు.
వైసీపీ శ్రేణులపై వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగినా.. బాధితులపైనే కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు. అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ తీసుకుని, ఏపీలో జరుగుతున్న అరాచకాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తాం అని జగన్ అన్నారు.
వైఎస్ జగన్ రోడ్డు మార్గాన వినుకొండకు వెళ్తుంటే దారి పొడవునా ఆయనకు పార్టీ నేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
దారి పొడవునా వైసీపీ అధినేత జగన్ను చూసిన ప్రతిచోట ప్రజలు సీఎం, సీఎం అని నినాదాలు చేశారు.