వరద నియంత్రణలో ఏపీ సర్కార్ ఫెయిల్- రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ఎడతెరిపి లేని వర్షాలు, వరదల తాకిడికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎవర్నీ కదిలించినా కన్నీటి చిత్రాలే. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాల ప్రజలు వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితులు రోజురోజుకీ ఘోరంగా మారిపోతున్నాయి. దీనిపై విపక్షాల నుంచి రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పాన్ ఇండియా స్టార్ - పెద్ద మనసున్న హీరో ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు... ఆఫ్ స్క్రీన్ కూడా బాహుబలి. ఈ పాన్ ఇండియా స్టార్ హీరో మనసు నిజ జీవితంలోనూ 'బాహుబలి' అంత పెద్దది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రాష్టాల ప్రభుత్వాలు భారీ ఎత్తున చేపడుతున్న సహాయక చర్యలకు ఆయన విరాళం ప్రకటించారు.ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రభాస్ ఐదు కోట్లకు ఇచ్చారని, ఇరు ప్రభుత్వాలకు రెండేసి కోట్లు చొప్పున సాయం అందించారని బుధవారం ఉదయం నుంచి జోరుగా ప్రచారం జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ లీడర్లకు షాక్ ఇచ్చిన హైకోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద హడావుడి చేసి దాడికి వెళ్లిన నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది. వాళ్లు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నివాసంపైకి జోగి రమేష్‌తోపాటు వైసీపీ లీడర్లు దాడికి వెళ్లారు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసును టీడీపీ పెట్టినా పోలీసులు విచారణ వేగంగా సాగలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఎంక్వయిరీ వేగంగా జరుపుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వరద బాధితులకు నారా భువనేశ్వరి సాయం- రెండు రాష్ట్రాలకు చెరో కోటి విరాళం
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు అన్ని రంగాల్లోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ నారా భువనేశ్వరి వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి కోటి రూపాయలు, తెలంగాణ సీఎం సహాయనిధికి మరో కోటి రూపాయల చొప్పిన హెరిటేజ్ ఫుడ్స్ తరఫున విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పొంచి ఉన్న వానగండం- ములుగులో భారీగా నేలకూలిన వృక్షాలు- సోమవారం వరకు స్కూల్స్‌కి సెలవులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అల్పపీడన ప్రభావం కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటికే వరదల దెబ్బ నుంచి కోలుకోని జిల్లాల్లో కూడా వర్షాలు పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రజలు, ప్రభుత్వాలు మరింత అప్రమత్తమై అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా కురిసిన వర్షాలకు, పొంగిన వరదలకు ప్రజలు చతికిల పడిపోయారు. ప్రభుత్వాలు ఆదుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మొదటి అంతస్తు వరకు నీళ్లు రావడంతో చిన్నపెద్ద అనే తేడా లేకుండా అంతా రోడ్డున పడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి