Dolly Chaiwala Charges For a Show Rs 5 Lakh 5 star Hotel : నాగపూర్‌లో ఓ బిజీ రోడ్ మీద చిన్న బల్ల పెట్టుకుని టీ అమ్ముతూ ఉంటాడు డాలీ చాయ్ వాలా. ఆయన ప్రత్యేకత టీ కాదు. స్టైలింగ్. ఆయన వేషం వెరైటీగా ఉంటుంది. టీ ఇచ్చే విధానమే కాదు.. సిగిరెట్ కూడా అలాగే వెలిగించి చూపిస్తాడు. అతని స్టైల్ బాగుందని జనం బాగానే వచ్చేవారు. అతి వద్ద టీ ఏడు రూపాయలు మాత్రమే. అటీ దుకాణం పెట్టిన రోజున అతనికి మూడు, నాలుగు వేల దాకా ఆదాయం వస్తుంది.
కానీ ఇప్పుడా డాలీ చాయ్ వాలా రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో డాలీ చాల్ వాలా సూపర్ స్టార్ రేంజ్ పాపులర్. ఎంత అంటే.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఆయన స్టాల్ వద్ద నిల్చుని ఏక్ చాయ్ ప్లీజ్ అని అడిగేంత. ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ డాలీ చాయ్ వాలా వద్ద టీ తాగాడు. అది వైరల్ అయిపోయింది.
ఇంత ఫేమ్ ఎలా వచ్చిందంటే.. డాలీ చాయ్ వాలా టీ ఇచ్చే విధానం వెరైటీగా ఉందని.. ఓ ఫుడ్ వ్లాగర్.. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే అది వైరల్ అయిపోయింది. తర్వాత చాలా మంది ఇలా వచ్చి ీజియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ప్రారంభించారు. ఆ వీడియోలన్నీ ఇన్ స్టంట్ హిట్స్. దీంతో.. డాలీనే స్వయంగా సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేసి రోజూ తన వీడియోలు పెట్టుకోవడం ప్రారంభించారు. ఫాలోయర్లు పిచ్చగా పెరిగిపోయారు. ఇప్పుడు అతన్ని ప్రమోషన్ కోసం పిలిచేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఊరికే చేస్తాడా.. లక్షలు వసూలు చేస్తాడు. మాల్దీవ్స్ కూడా పిలిచి పబ్లిసిటీ చేయించుకుంది.
దేశ విదేశాల నుంచి చాలామంది ఫుడ్ వ్లాగర్స్.. షూటింగ్ కోసం పిలుస్తూంటారు. వస్తాను కానీ.. ఉచితంగాకాదని.. లెక్క చెబుతాడు. రోజుకు ఐదు లక్షలు.. ఫైవ్ స్టార్ హోటల్ స్టే ఇస్తే మాత్రమే వస్తానంటాడు. అలా ఇచ్చి పిలిపించుకునేవాళ్లు లెక్కలేనంత మందిఉంటారు. కొంత మంది లగ్జరీ కార్లు పంపుతూ ఉంటారు . ఆ కార్లతో ఆయన చేసే రీల్స్ కూడా వైరలే. ఇంత సంపాదించాడా అని చాలా మంది ఆశ్చర్యపోతూంటారు. మన తెలుగు హీరో నాని కూడా డాలీ స్టాల్ ను నాగపూర్ లో సందర్శించాడు.
అయితే నిరుపేద కుటుంబం.. రోజుకు మూడు నాలుగు వేలసంపాదన వస్తే గొప్ప అనుకున్నా.. ఫుట్ పాత్ మీద బిజినెస్ చేసుకున్నా.. తనకు గుర్తింపు తెచ్చుకున్న స్టైలింగ్ టీ ని మాత్రం వదల్లేదు. కుదిరినప్పుడల్లా నాగపూర్ ఫుట్ పాత్ మీద టీ స్టార్ పెడతారు. ఇప్పుడు రోజుకు లక్షలు సంపాదిస్తూ ఉండవచ్చు కానీ.. ఆయన జీవితం మాత్రం.. అంత పూలపాన్పు కాదు. సోషల్ మీడియా పుణ్యాన సూపర్ స్టార్ అయిపోయాడు. ఆ స్టారిజాన్ని ఎలా వాడుకోవాలో కూడా బాగా నేర్చుకున్నాడు.