Wrestlers on Narco Test:


టెస్ట్‌కి సిద్ధమే...


ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన కొనసాగుతూనే ఉంది. తమ డిమాండ్‌లు నెరవేర్చేంత వరకూ నిరసన ఆపమని తేల్చి చెప్పారు. బ్రిజ్‌ భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ మాత్రం తనపై వచ్చే ఆరోపణలు నిరాధారమైనవని కొట్టి పారేస్తున్నారు. కేవలం తనను డీఫేమ్ చేసేందుకు జరిగే కుట్ర అని చెబుతున్నారు. తరచూ ట్విటర్‌లో రెజ్లర్లపై విమర్శలు చేస్తున్న ఆయన..ఇటీవల ఓ పోస్ట్ చేశారు. తాను నిర్దోషిని అని నిరూపించుకోడానికి లై డిటెక్ట్ (Polygraph Test) టెస్ట్‌కి సిద్ధంగా ఉన్నానని అన్నారు. రెజ్లర్లు చేసే ఆరోపణలు నిజమా కాదా తేలాలంటే వాళ్లు కూడా ఈ టెస్ట్‌కి అంగీకరించాలని సవాలు విసిరారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెజ్లర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన అమ్మాయిలంతా నార్కో టెస్ట్‌కి (Narco Test) సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. బ్రిజ్ భూషణ్‌పై మొత్తం ఏడుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. అంతే కాదు. ఈ టెస్ట్‌ని లైవ్ టెలికాస్ట్ చేసి ప్రజలందరికీ చూపించాలనీ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఈ ప్రక్రియని మానిటర్ చేయాలని కోరారు. 


"బ్రిజ్ భూషణ్ నార్కో టెస్ట్‌కి సిద్ధమా అని సవాలు విసిరారు. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ...అదంతా సుప్రీంకోర్టు నేతృత్వంలోనే జరగాలి. దేశమంతా దాన్ని లైవ్‌లో చూడాలి"






- రెజ్లర్లు 


బ్రిజ్ భూషణ్ ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో ఒక్కసారిగా ఈ సవాళ్ల ఎపిసోడ్ మొదలైంది. తాను నార్కో టెస్ట్‌కి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన ఆయన..రెజ్లర్లు కూడా అందుకు రెడీయా అంటూ ప్రశ్నించారు. 


"నార్కో టెస్ట్ చేయించుకోడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాదో కండీషన్ ఉంది. నాతో పాటు వినేష్ ఫోగట్, బజ్‌రంగ్ పునియా కూడా టెస్ట్ చేయించుకోవాలి. వాళ్లిద్దరూ అందుకు రెడీ అంటే...ప్రెస్‌ని పిలవాలి. అప్పుడు నేను వాళ్లకు ఈ ప్రామిస్ చేస్తాను. కచ్చితంగా టెస్ట్ చేయించుకుంటాను"


- బ్రిజ్ భూషణ్, WFI చీఫ్ 






ఇప్పటికే బజ్‌రంగ్ పునియా బ్రిజ్ భూషణ్‌పై మండి పడ్డారు. పోలీసులు తమను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 


"మాకు 500 కిలోమీటర్ల దూరంలో కూర్చుని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పోలీసులు మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన తప్పు చేశారు. అనవసరంగా ఆయనను స్టార్ చేయకండి"


- బజ్‌రంగ్ పునియా, రెజ్లర్ 


తమకు సపోర్ట్ చేస్తున్న వారిని పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు రెజ్లర్ సాక్షి మాలిక్. ఎవరినైనా పోలీసులు అడ్డగిస్తే అక్కడే క్యాండిల్‌ మార్చ్ చేసి శాంతియుతంగా నిరసన తెలపాలని సూచించారు.  


Also Read: Srinagar G20 Meet: శ్రీనగర్‌లోని G-20 సదస్సుకి డుమ్మా కొట్టిన చైనా, భారత్ అదిరిపోయే కౌంటర్