World’s Most Loyal Employee: ఓ ప్రైవేట్ కంపెనీలో రెండు, మూడేళ్లు చేయటమే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అరుదు. అలాంటింది ఓ వ్యక్తి ఒకే కంపెనీలో ఏకంగా 84 ఏళ్ల పాటు పని చేశారు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా, ఇది నిజం. ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కింది.
ఎంత ఓపిక
బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి గత 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వాల్టర్ ఓర్త్‌మాన్ అత్యధిక కాలం ఒకే సంస్థలో పని చేసినందుకు గానూ ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇటీవల ఆయన తన 100వ పుట్టినరోజును కూడా కంపెనీలోనే జరుపుకున్నారు. వాల్టర్ ఓర్త్‌మాన్ బ్రస్క్‌లోని రెనాక్స్ ఎస్ఏ అనే టెక్స్‌టైల్ కంపెనీలో 1938 జనవరి 17 నుంచి పని చేస్తున్నారు. తన 15వ ఏట ఆయన ఈ కంపెనీలో చేరారు.
అసిస్టెంట్‌గా మొదలు
షిప్పింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు వాల్టర్. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సేల్స్ మేనేజర్ స్థాయికి చేరారు. తన 84 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో వాణిజ్య పరంగా అనేక మార్పులను చూశారు. సేల్స్ మేనెజర్‌గా ఉన్నప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ఒకే కంపెనీలో పనిచేయడానికి సీక్రెట్ ఏంటో ఆయన చెప్పారు.
ఇంకా చేస్తున్నారు
ఏప్రిల్ 19న వాల్టర్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన తన ఉద్యోగాన్ని కొనసాగించాలనే భావిస్తున్నారు. రెనాక్స్ ఎస్ఏ కంపెనీలో చేరిన తొలినాళ్లను ఆయన గుర్తు చేసుకుంటూ.. ఫోన్లు, కంప్యూటర్లు లేని రోజులను నెమరువేసుకున్నారు. ప్రస్తుత సాంకేతికత కారణంగా పని సులభంగా ఉందని ఆయన అన్నారు.
Also Read: Coronavirus Cases: వరుసగా రెండో రోజు 3 వేల కరోనా కేసులు- 60 మంది మృతి