Coronavirus Cases: దేశంలో కొత్తగా 3,377 కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండు రోజులు కరోనా కేసులు 3 వేలకు పైనే నమోదయ్యాయి. కొత్తగా 60 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- యాక్టివ్ కేసులు: 17801
- మొత్తం మరణాలు: 523753
- మొత్తం కేసులు: 4,30,72,176
- రికవరీలు: 4,25,30,622
- మొత్తం కేసుల సంఖ్య 4,30,72,176కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 17,801కి పెరిగింది.
- మొత్తం రికవరీల సంఖ్య 4,25,30,622కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,23,753కు పెరిగింది.
- మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.04గా ఉంది. రికవరీ రేటు 98.74గా ఉంది.
- డైలీ పాజిటివిటీ రేటు 0.71గా ఉంది.
వ్యాక్సినేషన్
దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. గురువారం 22,80,743 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,88,65,46,894 కు చేరింది. వేగంగా వీలైనంత మందికి వ్యాక్సిన్ అందించాలని కేంద్రం కృషి చేస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ అంచనాల మధ్య వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మోదీ ఆదేశించారు.
Also Read: Mayawati: యూపీ సీఎం లేదా ప్రధాని అంతే- రాష్ట్రపతి పదవి నాకు వద్దు: మాయావతి