Mayawati: మాయావతికి రాష్ట్రపతి పదవి ఇవ్వాలని భాజపా యోచిస్తుందా? అవును అనే అంటున్నారు.. యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. మాయావతికి రాష్ట్రపతి ఆఫర్ ఇచ్చారని అందుకే ఆమె గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు తెర వెనుక సపోర్ట్ చేశారని అఖిలేశ్ విమర్శించారు. అయితే ఈ విమర్శలకు మాయావతి కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు.
పదవీ కాలం పూర్తి
ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అధికార భాజపా ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి విపక్ష నేతలతో సంప్రదింపులు ఇప్పటి నుంచే మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్‌డీఏ తరఫు రాష్ట్రపతి అభ్యర్థికి పోటీగా తమ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్, ఇతర విపక్షాలు భావిస్తున్నాయి.
గులాం నబీ ఆజాద్, నితీశ్ కుమార్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు తదుపరి రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది. అయితే తాజాగా బీఎస్‌పీ చీఫ్ మాయావతి కూడా రాష్ట్రపతి పదవిని ఆశిస్తున్నారన్న ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ ప్రచారాన్ని మాయావతి తోసిపుచ్చారు. తనకు రాష్ట్రపతి కావాలని ఎలాంటి ఆశలు లేవన్నారు. యూపీ సీఎం లేదా ప్రధాని కావాలనే కోరుకుంటున్నట్లు తెలిపారు.
Also Read: Donald Trump: అణు బాంబుకే భయపడని ట్రంప్‌కు- ఆ పండంటే చచ్చేంత భయం!
Also Read: Egyptair Crash 2016: ఒక్క సిగరెట్ ఖరీదు 66 మంది ప్రాణాలు- ఎంత పని చేశావ్ సారూ!