ఆంధ్రప్రదేశ్‌లో పింక్ డైమండ్ గురించి జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు. ఆ డైమండ్ శ్రీవారిదని..దాన్ని దేశం దాటించారని.. సౌతిబీ అనే సంస్థ దాన్ని స్విట్టర్లాండ్‌లో వేలం వేసిందని... చాలా మంది ఆరోపించారు. అలా ఆరోపించిన వాళ్లు తీరా పవర్‌లోకి వచ్చిన తర్వాత తూచ్ అసలు శ్రీవారికి పింక్ డైమండ్ అనేది లేదని సర్టిఫై చేశారు. ఈ ఎపిసోడ్ అంతా  పక్కన పెడితే.. ఇప్పుడు అదే సౌతిబీ సంస్థ..   హాంకాంగ్‌లో మరో వజ్రం వేలం వేసింది. అయితే ఇది పింక్ కాదు.. బ్లూ డైమండ్. 


వజ్రాల్లో కలర్స్ ఉండటం కష్టం. అలాంటి రంగు వజ్రాలకు చాలా విలువ ఉంటుంది. అలాంటి అరుదైన వివిడ్  బ్లూ అంటే నీలం రంగు వజ్రాన్ని సింగపూర్‌లో వేలం వేశారు.  ఈ అరుదైన వజ్రం.  ఒపెన్‌హైమర్ బ్లూ కంటే ఈ వజ్రం పెద్దది. అది 14.62 క్యారెట్ లు ఉంది. 10 క్యారెట్ల కంటే ఎక్కువ విలువైన రత్నాలు ఐదు మాత్రమే ఉన్నాయి.  ఏదీ 15 క్యారెట్‌లకు మించి లేదు.  15 క్యారెట్ల కంటే ఎక్కువ ఉన్న నీలి వజ్రం ఇది మాత్రమే అని అంతర్జాతీయ మీడియా తెలిపింది. 


ప్రస్తుతం 15.10 క్యారెట్ల వివిడ్ బ్లూ డైమండ్‌ను  రికార్డు స్థాయిలో రూ.371 కోట్లు ధర పెట్టి కొనుగోలుచేశారు.  రూ.350 కోట్ల దాకా పలుకుతుందని తొలుత అనుకున్నారు. అయితే.. అంతకుమించిన ధర వచ్చింది. 2021లో దక్షిణాఫ్రికాలోని గనుల్లో ఈ వజ్రం దొరికింది. దీన్ని రూ.308 కోట్లకు డిబీర్స్, డయాకోర్‌ సంస్థలు కొనుగోలు చేసి.. పాలిషింగ్‌ అనంతరం అమ్మకానికి పెట్టాయి. 



 ఇది ఎక్కడ దొరికిందో కూడా చెప్పారు కాబట్టి రాజకీయం చేయాడానికి కూడా అవకాశం లేకుండాపోయింది. మన దగ్గర కేజీఎఫ్ లాంటి చోట్ల బంగారం తవ్వుతారేమోకానీ దక్షిణాఫ్రికాల్లో మాత్రం వజ్రాల గనులు ఉంటాయి. చాలా అరుదైన సందర్భాల్లో ఇలాంటి అరుదైన వజ్రాలు లభ్యమవుతూ ఉంటాయి.