SpaceX: స్పేస్ ఎక్స్ అంతరిక్ష పరిశోధనల్లో దూసుకెళ్తోంది. స్పేస్ ఎక్స్ తన డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్యూల్ ద్వారా నలుగురు ఆస్ట్రోనాట్స్ ను ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు పంపించింది. మూడు వారాల్లో స్పేస్ ఎక్స్ నుంచి ఇది రెండో ప్రయోగం. మూడు వారాల క్రితం నలుగురు ప్రైవేట్ వ్యక్తులను ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు తీసుకెళ్లింది స్పేస్ ఎక్స్.




Axiom స్పేస్ కంపెనీ తమ స్పేస్ టూరిజంను డెవలప్ చేసుకోవటానికి స్పేస్ ఎక్స్ పైనే ఆధారపడుతోంది. నాసా కు కార్గో సప్లైయిర్ గా మొదలైన స్పేస్ ఎక్స్ ప్రస్థానం...ఇప్పుడు రష్యా పై ఆధారపడకుండా నాసా కు వ్యోమగాములను తరలించే ఏకైక మార్గంగా మారిపోయింది.


దూసుకెళ్తోంది


బోయింగ్ కూడా నాసా అనుమతులిచ్చినా స్పేస్ ఎక్స్ అంత దూకుడుగా మరో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ వ్యవహరించలేకపోతోంది. ఫాల్కన్ రాకెట్, డ్రాగన్ క్యాప్సూల్స్, మెర్లిన్ ఇంజిన్ ఇలా ఏ రకంగా చూసుకున్నా స్పేస్ ఎక్స్ దూసుకెళ్తోంది. బూస్టర్ లను తిరిగి వినియోగించగలిగేలా సాంకేతికతను వాడటం స్పేస్ ఎక్స్ కు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సరే ఇప్పుడు తాజాగా నాసాకు చెందిన ముగ్గురు ఆస్ట్రోనాట్లను, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఓ ఆస్ట్రోనాట్ ను స్పేస్ ఎక్స్ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు పంపించింది. ఈ పర్యటనలో చాలా విశేషాలు ఉన్నాయి.


మొక్కల పెంపకం


ఈసారి స్పేస్ ఈ బృందం మొక్కల పెంపకంపై దృష్టి సారించింది. మట్టి అవసరం లేకుండా మొక్కలను పెంచే టెక్నాలజీలపై ఈ బృందం లోతుగా అధ్యయనం చేయనుంది. ఈ క్రూ 4 కు ముందే క్రూ 3 టీం వెళ్లినప్పుడే ఈ మొక్కల పెంపకం పరిశోధనలు ప్రారంభించారు. వాటిని ఇప్పుడు రీసెంట్ గా వెళ్లిన బృందం మరింత ముందుకు తీసుకెళ్లుతుంది. మట్టి అవసరం లేకుండా హైడ్రో పోనిక్స్ అంటే నీళ్ల ద్వారా మొక్కలు పెంచటం, ఏరో పోనిక్స్ అంటే గాలి ద్వారా మొక్కలను పెంచటం లాంటి ప్రయోగాలు ఈ సారి డ్రాగన్ క్రూ 4 ఆస్ట్రోనాట్స్ ఇంపార్టెన్స్ ఇవ్వనున్నారు. ఈ ప్రయోగాలకు XRoot అనే పేరు కూడా పెట్టారు.


గతంలోనే అంతరిక్షంలో మొక్కలు పెంచే ప్రయోగాలు చేపట్టినా...ఇంత పెద్దస్థాయిలో జరగలేదు. చాలా చిన్న మొత్తంలో మొక్కల పెంపకంపై ప్రయోగాలు జరిగాయి కానీ ఈసారి హైడ్రో పోనిక్స్ , ఏరో పోనిక్స్ టెక్నాలజీ ద్వారా పెద్దమొత్తంలో మొక్కల పై ప్రయోగాలు జరిపి భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల కోసం వచ్చే వారికి ఉపయోగపడేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కేవలం మొక్కలపైనే కాదు క్రూ4 ఆస్ట్రోనాట్లు ఆర్టిఫిషియల్ హ్యూమన్ సెల్స్ పైనా ప్రయోగాలు చేయనున్నారు.


Also Read: World’s Most Loyal Employee: 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో ఉద్యోగం- నీ ఓపికకు దండం సామీ!


Also Read: Also Read: Elon Musk Buys Twitter: ఎలాన్ మస్క్ ఓ వింత మనిషి- అంతేనా కాదు అంతకుమించి!