Covid-19 Telugu News: ప్రపంచంలోని అనేక దేశాలు కరోనా కొత్త వేరియంట్ ఫ్లిర్ట్(FLiRT)కి బలైపోతున్నట్లు కనిపిస్తోంది. గత ఒక నెలలో యునైటెడ్ స్టేట్స్, సింగపూర్, భారతదేశంలో ఇన్ఫెక్షన్ కేసులు అకస్మాత్తుగా పెరిగాయి. ప్రస్తుతం సింగపూర్‌లో ఈ కొత్త వేరియంట్ బారిన పడిన వారిని అత్యధిక సంఖ్యలో గుర్తించారు. భారతదేశంలో కూడా కరోనా ముప్పు పెరుగుతోంది. దీంతో చాలా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ సోకిన వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంది.
కరోనా ఈ కొత్త వేరియంట్‌కి సంబంధించిన అధ్యయనం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో కొన్ని ఉత్పరివర్తనలు ఉద్భవించాయి. ఇవి సులభంగా శరీరంలోకి ప్రవేశించగలవు .. సోకిన తర్వాత ఇన్‌ఫెక్షన్‌ను పెంచగలవు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు చాలా స్థిరంగా ఉన్నాయి..కానీ ఇన్ఫెక్షన్ అకస్మాత్తుగా ఎందుకు పెరిగిందనేది చాలా మంది మదిలో మెదలుతున్న ప్రశ్న?
15 రోజుల్లో 90 శాతం కేసులు
మే 5 నుండి 11 వరకు అంటే ఒక వారంలో సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MOH) నివేదించిన కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 25,900 కంటే ఎక్కువ. అంతకుముందు వారం 13,700 కేసుల నుండి ఈ కేసుల్లో 90శాతం పెరుగుదల నమోదైంది. చాలా సందర్భాలలో ఫ్లిర్ట్ వేరియంట్ (KP.2) ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఫిబ్రవరి-మార్చిలో సింగపూర్‌లో సోకిన వ్యక్తుల సంఖ్య చాలా స్థిరంగా ఉంది. అయితే ఈ కొత్త వేరియంట్ అకస్మాత్తుగా ఎలా పెరిగింది. దీనిపై ఎపిడెమియాలజిస్టులు కారణాలు వెల్లడించారు.
న్యూయార్క్‌లోని యూనివర్శిటీ ఆఫ్ బఫెలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హెడ్ థామస్ ఎ. రస్సో మాట్లాడుతూ.. కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడానికి అనేక అంశాలు కారణమవుతాయని చెప్పారు. అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే, వైరస్‌లు తమ ఉనికిని కాపాడుకోవడానికి నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటాయి. ఒక్క కరోనా మాత్రమే కాదు, ఇది అన్ని వైరస్‌లతో జరిగే నిరంతర ప్రక్రియ. కరోనా ప్రాథమిక రూపం కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. కొత్త వేరియంట్ ఫ్లిర్ట్ కూడా ఓమిక్రాన్ రూపాంతరం, మ్యుటేషన్ కారణంగా దాని స్పైక్ ప్రోటీన్‌లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. అవి దాని రూపాన్ని మారుస్తున్నాయి.
రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారే బాధితులు
ఇది కాకుండా, సంక్రమణ పెరుగుదలకు మరొక కారణం ప్రపంచవ్యాప్తంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తుల సంఖ్య. యువ జనాభాలో కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి తగ్గిన కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని కారణంగా కొత్త వేవ్ వ్యాప్తించే సంభావ్యత పెరుగుతోంది. జనాలపై టీకాల ప్రభావం కాలక్రమేణా తగ్గుతుంది, చాలా మందికి వారి చివరి టీకా తీసుకుని చాలా కాలం అయ్యింది, ఇది మరోసారి ఇన్ఫెక్షన్ కేసుల పెరుగుదలకు దారితీస్తుంది. కొన్ని అధ్యయనాలలో శాస్త్రవేత్తలు అటువంటి ప్రమాదాలను తగ్గించడానికి ఫ్లూ వంటి కోవిడ్ వ్యాక్సిన్‌కు వార్షిక టీకాలు వేయాలని కూడా సిఫార్సు చేస్తున్నారు.
టీకా కవరేజీలో గ్యాప్
కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరగడానికి మూడవ కారణం వ్యాక్సిన్ కవరేజ్ ఏజ్ గా చెబుతున్నారు. సెప్టెంబర్ 2023 నుండి కేవలం 22.6శాతం పెద్దలు మాత్రమే కోవిడ్-19 వ్యాక్సిన్‌ని పొందారు. 75 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఈ కాలంలో ఎక్కువ టీకాలు వేసుకోవడంతో, టీకా కవరేజ్ వయస్సును బట్టి పెరిగిందని కూడా సీడీసీ డేటా చూపిస్తోంది. అందువల్ల, వృద్ధులలో కరోనా నుండి రక్షణ వ్యవస్థ కనిపిస్తుంది.. కానీ యువతలో రోగనిరోధక శక్తి లేదు. కరోనా ఇటీవలి నివేదికల ప్రకారం.. యువ జనాభా కొత్త వేరియంట్‌ల అతిపెద్ద బాధితులుగా కనిపిస్తుంది.