Kami Rita Sherpa: ‘ఎవరెస్ట్ మ్యాన్‌’గా పేరొందిన 54 ఏళ్ల నేపాలీ షెర్పా కమీ రీటా సరికొత్త రికార్డును నమోదు చేశాడు.  30వసారి కూడా ఎవరెస్టును అధిరోహించి తన పేరిట నమోదైన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు కమీ రీటా బుధవారం 30వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అత్యధిక సార్లు అధిరోహించిన వ్యక్తిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు అందుకుంటున్నాడు.  54 ఏళ్ల పర్వతారోహకుడు కమి రీటా  స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7:49 గంటలకు 8,849 మీటర్ల శిఖరంపై అడుగు పెట్టాడు.  కమీ రీటా కేవలం 10 రోజుల క్రితం అంటే మే 12న 29వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించారు. షెర్పా 1994లో తొలిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.


1992 నుండి పర్వతారోహణ ప్రారంభం
కమీ రీటా షెర్పా 1970 జనవరి 17న జన్మించారు. అతను అధికారికంగా 1992లో పర్వతారోహణ ప్రారంభించారు. ఆ ఏడాది అతను సహాయక సిబ్బందిగా ఎత్తైన శిఖరానికి యాత్రలో చేరాడు. రెండు సంవత్సరాల తరువాత అతను ఎవరెస్ట్ అధిరోహణలో విజయం సాధించాడు.  ఆ తర్వాత అతని ఉత్సాహం పెరిగింది.


మరెన్నో శిఖరాలు అధిరోహించిన కమీ రీటా 
కమీ రీటా షెర్పాకు చిన్నప్పటి నుంచి పర్వతాలు, లోయల్లో ప్రయాణించడం అంటే ఇష్టం. దాదాపు మూడు దశాబ్దాలుగా పర్వతాలను అధిరోహిస్తున్నాడు. అందుకే అతన్ని మౌంటేన్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. విశేషమేమిటంటే,  కమీ రీటా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో విజయం సాధించడమే కాకుండా   K2 శిఖరం, చో ఓయు, ల్హోట్సే , మనస్లుపై తన దేశ జెండాను ఎగురవేశాడు. గతేడాది ఇదే సీజన్‌లో అతను 27వ,  28వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించాడు.


కమీ  తాజా అధిరోహణ అతని ప్రసిద్ధ పర్వతారోహణ వృత్తిలో ఒక మైలురాయిని సూచిస్తుంది. గతేడాది అతను ఒకే సీజన్‌లో రెండు విజయవంతమైన శిఖరాలను సాధించాడు.  సవాళ్లు,  రిస్క్‌లు ఉన్నప్పటికీ కమీ తన అద్భుతమైన విజయాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధిరోహకులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాడు. అత్యధిక సార్లు ఎవరెస్ట్ అధిరోహించిన వ్యక్తిగా తన స్థానాన్ని చరిత్రలో పదిల పరుచుకున్నాడు.  బ్రిటీష్ పర్వతారోహకుడు కెంటన్ కూల్ కూడా 18వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించాడు.   


సీనియర్ గైడ్‌గా తమ సంస్థకు చెందిన ఔత్సాహిక ట్రెక్కింగ్‌ల బృందానికి మార్గనిర్దేశం చేయడం ద్వారా కమీ రీటా మరోసారి ఎవరెస్ట్‌ను చేరుకున్నారని 'సెవెన్ సమ్మిట్ ట్రెక్స్' తెలిపింది. నేపాల్ ప్రభుత్వ పర్యాటక శాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈసారి ఎవరెస్ట్‌కు వెళ్లే ముందు కమీ రీటా మీడియాతో మాట్లాడారు. ఎవరెస్ట్‌ని ఎన్నిసార్లు అధిరోహిస్తాను అని ఇంకా లెక్కలు వేసుకోలేదు. దీని వల్ల భవిష్యత్తులో మరిన్ని సార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించాలనే దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశాడు. ఏప్రిల్ నెలలో హిమాచల్​ ప్రదేశ్​లోని బిలాస్​పుర్​కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్‌లో మూడు రంగుల జెండా ఎగురవేశాడు. అనేక ప్రతికూల పరిస్థితులను తట్టుకుని కూడా ఆ బాలుడు తన పేరెంట్స్ తో కలిసి తన లక్ష్యాన్ని సాధించాడు.  ప్రస్తుతం యువన్ కు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ​