Guillain-Barre Syndrome: దేశంలో గిలాన్‌ బరే సిండ్రోమ్ అనే అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ కేసులు పెరగడంతో పెరూలో 90 రోజుల జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై ఈ వైరస్‌ దాడి చేస్తుంది. ఫలితంగా అనారోగ్యం బారిన పడుతున్నారు ప్రజలు. ఈ వైరస్ కారణంగా కొన్నిసార్లు పక్షవాతం కూడా వచ్చే ప్రమాదం ఉందని హెల్త్‌  ఏజెన్సీ జిన్హువా నివేదించింది.


గిలాన్‌-బరే సిండ్రోమ్ అంటే ఏమిటి?


గిలాన్‌ బరే సిండ్రోమ్ (GBS) అనేది అరుదైన వ్యాధి. దీని వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థే నరాలకు శత్రువుగా మారుతుంది. నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. నరాలపై ఈ దాడి వల్ల కండరాల బలహీనత, తిమ్మిరి, జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా కాళ్లలో ప్రారంభమై పైకి వ్యాపిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇది పక్షవాతం రావడానికి కారణమవుతాయి. ఈ సిండ్రోమ్ పెద్దలు,  పురుషులలో సర్వసాధారణం. అయితే ఇది ప్రస్తుతం అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది.


జీబీఎస్ రావడానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. ఇది తరచుగా ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుందని చెబుతున్నారు. ఇన్‌ఫ్లుయెంజా, సైటోమెగలూ, ఎప్‌స్టెయిన్‌ బర్‌తోపాటు కోవిడ్‌ వైరస్‌ జీబీఎస్‌కు దారి తీసే ప్రమాదం వార్తలు వస్తున్నాయి. ఇటీవలి శస్త్రచికిత్స లేదా టీకా వేసుకున్న వారిలో కూడా జీబీఎస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటివి చాలా అరుదు అని వైద్యశాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


గిలాన్‌ బరే రోగ నిర్ధారణ. రోగి లక్షణాలు, వారి నాడీ సంబంధిత పరీక్షపై ఆధారపడి ఉంటుంది. స్పైనల్ ట్యాప్  ఎలక్ట్రోమియోగ్రఫీ వంటి పరీక్షలు ఈ వ్యాధిని నిర్దారిస్తాయి. 


గిలాన్‌ బరే సిండ్రోమ్ లక్షణాలు..?



  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ ప్రకారం.. జీబీఎస్ అత్యంత సాధారణ లక్షణం బలహీనత. మెట్లు ఎక్కేటప్పుడు లేదా నడుస్తున్నప్పుడు కలిగే ఇబ్బంది ద్వారా ముందుగా గమనించవచ్చు.

  • శ్వాసను నియంత్రించే కండరాలు తీవ్రంగా బలహీనపడతాయి. శ్వాస తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. లక్షణాలు కనిపించిన మొదటి రెండు వారాల్లోనే చాలా మంది తీవ్రమైన జబ్బు బారిన పడతాారు. బలహీనమవుతారు. 

  • జీబీఎస్‌లో నరాలు దెబ్బతినడం వల్ల శరీరంలోని మిగిలిన భాగాల నుంచి మెదడు అసాధారణమైన సంకేతాలను అందుకుంటుంది. ఈ పరిస్థితిని పరేస్తేసియాస్ అంటారు. దీని ద్వారా జలదరింపు, చర్మం కింద కీటకాలు పాకుతున్నట్టు అనిపిస్తుంది. దీని వల్ల నొప్పి కూడా కల్గుతుంది. 


ఈ లక్షణాలు కూడా ఉండవచ్చు:



  • కంటి కండరాలు బలహీనపడటం, దృష్టిలో ఇబ్బంది.

  • మింగడం, మాట్లాడటం లేదా నమలడం కష్టం.    

  • చేతులు కాళ్లలో సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. సూదులు, పిన్నులతో పదే పదే పొడుస్తున్న ఫీలింగ్. 

  • శరీర నొప్పి తీవ్రంగా ఉంటుంది, ముఖ్యంగా రాత్రి సమయంలో.

  • సమన్వయ సమస్యలు, అస్థిరత.

  • అసాధారణ హృదయ స్పందన లేదా రక్తపోటు.

  • జీర్ణక్రియ లేదా మూత్రాశయ నియంత్రణతో సమస్యలు.


గిలాన్‌ బరే సిండ్రోమ్ కోసం చికిత్స ఏమిటి?


జీబీఎస్‌కి తెలిసిన చికిత్స లేనప్పటికీ.. అనారోగ్యం తీవ్రతను తగ్గించి, త్వరగా కోలుకునే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అత్యంత సాధారణంగా ఉపయోగించే చికిత్స ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (IVIG). వేరే వారిని నుంచి రక్తం తీసుకొని దాన్ని వ్యాధిపై పోరాడేలా చేయవచ్చు. ఇది నరాల మీద రోగనిరోధక వ్యవస్థ యొక్క దాడిని నియంత్రించడానికి సహాయ పడుతుంది. ప్లాస్మా మార్పిడి కూాడ ఇంకో చికిత్సగా వాడుతున్నారు. ఇది మీ రక్తంలోని ద్రవ భాగాన్ని ఫిల్టర్ చేస్తుంది. నరాలపై దాడి చేసే హానికరమైన వాటిని తొలగిస్తుంది. చాలా మంది రోగులు దీని నుంచి కోలుకుంటారు. అయితే కొందరు కండరాల బలహీనత, నడవడంలో ఇబ్బంది, లేదా తిమ్మిరి, జలదరింపు వంటి లక్షణాలను అనుభవించడం కొనసాగుతున్నాయి. తీవ్రమైన సందర్భాల్లో, రోగులకు వాకర్ లేదా వీల్ చైర్ అవసరం కావచ్చు.


జీబీఎస్ కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ ఉందా?


జీబీఎస్ కు వ్యాక్సిన్ లేదు. టీకాలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి కాబట్టి.. వ్యాక్సిన్ వాడే అవకాశం లేదు.