Pakistan Tea :  శ్రీలంక తరహాలో పాకిస్తాన్ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆ దేశానికి అన్నీ అప్పులే కానీ ఆదాయం లేకుండా పోయింది. పైగా ఆ దేశంలో ఆహార పదార్థాలు ఎక్కువగా దిగుమతలు మీద ఆధారపడుతూ ఉంటారు. చివరికి అక్కడి ప్రజలు తాగే టీ కూడా దిగుమతి చేసుకోవాలి. సహజంగానే పాకిస్తాన్ ప్రజలు టీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. అందుకే దిగుమతులు కూడా ఎక్కువే. అందుకే ఆ దేశ మంత్రి ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రజలు టీ తాగే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలన్నారు. 



అతి తక్కువ టీ తాగాలని మంత్రి అహసాన్ ఇక్బాల్  ప్రజలకు పిలుపునిచ్చారు. టీ కోసం దిగుమతి చేసుకుంటున్నామని అలా దిగుమతి చేసుకోవడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బు లేదని అప్పు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే టీ తాగే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నారు.


ఆయన ప్రకటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ముఖ్యంగా భారతీయ నెటిజన్లు గతంలో అభినందన్ విషయంలో పాకిస్తాన్ చేసిన ట్రోలింగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో అభినందన్ పాకిస్థాన్ టీ చాలా బాగుందని చెప్పారని పాకిస్థానీ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇప్పుడు దాన్నే గుర్తు చేసి మంత్రి ప్రకటనను ట్వీట్ చేస్తున్నారు. 


 





ప్రపంచంలో తేయాకును మరే దేశంకన్నా అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం పాకిస్తాన్. గత ఏడాది  సుమారు 5,000 కోట్ల రూపాయలు  కన్నా ఎక్కువ విలువైన టీని పాక్ దిగుమతి చేసుకుంది. పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలలు ఫిబ్రవరిలో 1,600 కోట్ల డాలర్లుగా ఉంటే.. జూన్ మొదటి వారానికి 1,000 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ మొత్తం.. ఆ దేశం చేసుకునే దిగుమతులన్నటికీ రెండు నెలల చెల్లింపులకు మాత్రమే సరిపోతంది.