China alien news : ఇతర గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నారా లేదా అన్నది ఇప్పటికీ మిస్టరీనే. పరిశోధకులు .. పరిశోదనలు చేసి ఉన్నాయని కొందరు.. లేవని కొందరు చెబుతూంటారు. సినిమా వాళ్లేమో తమ క్రియేటివిటీని జోడించి.. ఏలియన్స్ ఎలా ఉంటారనేది కూడా ఊహించి కథలు కథలుగా సినిమాలు తీసి చెబుతూ ఉంటారు. కానీ ఇప్పటికీ అసలు ఏలియన్స్ ఉన్నారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. అయితే చైనా మాత్రం ఏలియన్స్ ఉన్నారని త్వరలో ధృవీకరించేందుకు సిద్ధమవుతోంది.
ఈ లేడీ ఎంప్లాయిస్ చేసిన పనికి షాకైన గూగుల్, డిఫెండ్ చేసుకున్నా లాభం లేకపోయింది
స్కై ఐ ద్వారా ఇతర గ్రహాల్లో జీవులను చూస్తున్న చైనా
ఇటీవల భారీ రేడియో టెలిస్కోప్ స్కై ఐని చైనా ఆవిష్కరించింది. స్కై ఐ ఇప్పుడు ఓ కొత్త సమాచారాన్ని ఇచ్చిందని చైనా నుంచి సమాచారం లీక్ అయింది. ఈ భూగోళం అవతల కూడా ప్రాణులు ఉన్నట్లు గుర్తించింది. చైనాకు చెందిన మీడియా ఈ విషయాన్ని చెబుతోంది. సీక్రెట్ అనుకున్నారేమో కానీ తర్వాత వాటిని డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఇవి ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. గ్రహాంతర జీవాలు ఉన్నట్లు స్కై ఐ పసికట్టినట్లు చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
హవ్వ అలాంటి పనులకూ బాడీగార్డులను పెట్టుకుంటారా ? పుతిన్‌కే సాధ్యం !
గ్రహాంతర వాసులున్నారని చైనాకు ప్రాథమిక సమాచారం
స్కై ఐ టెలిస్కోప్‌కు చెందిన ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సిగ్నల్స్‌ను పరిశోధకులు ఇంకా స్టడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్కై ఐ అందించిన సిగ్నల్స్‌పై కొన్ని అనుమానాలు ఉన్నాయని, ఓ తరహా రేడియో తరంగాల ప్రమేయం జరిగిందని, దీనిపై మరింత విశ్లేషణ అవసరమని చైనా సైంటిస్టులుచెబుతున్నారు. ప్రస్తుతం గ్రహాంతరవాసుల సమాచారం చైనాలో సోషల్ నెట్వర్క్ వీబోలో ట్రెండ్ అవుతోంది. ఆ సమాచారాన్నే దేశంలోని ఇతర మీడియా కూడా వైరల్ చేస్తోంది.
'నాన్నా పులులే గుంపుగా వస్తాయ్- నేను సింగిల్‌గా వస్తా', ఈ షాకింగ్ వీడియో చూశారా?
రహస్యంగా వివరాలను ఉంచుతున్న చైనా
2020 సెప్టెంబర్‌లో స్కై ఐని ఆవిష్కరించారు. గ్రహాంతర జీవాన్వేషణ చేసేందుకు ఆ టెలిస్కోప్‌ను స్టార్ట్ చేశారు. 2020లో రెండు సార్లు, 2022లో మరో సారి అనుమానిత సిగ్నల్ వచ్చాయని, ఆ డేటాను స్టడీ చేస్తున్నారు. ఏలియన్స్ అన్వేషణలో స్కై ఐ చాలా సున్నితంగా, కీలకంగా పనిచేస్తోంది. ఈ స్కైఐ నిజంగానే ఏలియన్స్ జాడను గుర్తిస్తే.. తర్వాత ఇక అక్కడకు వెళ్లడానికి పరిశోధనలు ప్రారంభించే అవకాశం ఉంది.