Putin bodyguards :   రష్యా ప్రెసిడెండ్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌ గురించి బయట ప్రపంచానికి తెలిసింది తక్కువ. రష్యా మీడియా ఏది చెబితే అది నమ్మాలి. అయితే కొన్ని విషయాలు మాత్ర సీక్రెట్‌గా బయటకు వస్తూ ఉంటాయి.  తాజాగా పుతిన్‌ గురించి ఒక విచిత్రమైన న్యూస్ బయటకు తెలిసింది.  అసలు సెక్యూరిటీతో పాటు పుతిన్‌ కు ప్ర‌త్యేక‌మైన ఒక బాడీగార్డ్ ఉన్నాడని.. ఆయన ప్రత్యేకమన సేవలు చేస్తారని వెల్లడయింది. ఇంతకీ ఆ బాడీగార్డ్ ఏం చేస్తారు..? అంటే... పుతిన్ మలమూత్రాలను సేకరిస్తాడు. 


ఖబడ్దార్ అమెరికా, ఆయుధ సరఫరా ఆపకుంటే విధ్వంసమే: పుతిన్ వార్నింగ్


పుతిన్ మలమూత్రాలు సేకరించడమే ఆ బాడీగార్డ్ డ్యూటీ 


పుతిన్ మ‌ల‌ మూత్రాల‌ను ఆ బాడీగార్డ్ సేక‌రిస్తుంటాడు. దీనిపై అంతర్జాతీయ మీడియా కీలక విషయాలు వెల్లడించింది. పుతిన్ ఆరోగ్య ర‌హ‌స్యాలు తెలియ‌కుండా ఉండేందుకు.. బాడీగార్డు ఇలా ఆయన మలమూత్రాలను సేకరిస్తుంటాడని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇతరులకు దొరకకుండా ఉండటానికి...  ఛీ యాక్.. వాటిని ఇతరులు ఎందుకు తీసుకుంటారనే డౌట్ మనకు రావొచ్చు. కానీ పుతిన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న కొన్ని దేశాలు వాటిని సేకరించి టెస్టులు చేస్తాయని అనుమానిస్తున్నారు. 


రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!


పుతిన్ ఆరోగ్యం గురించి బయటకు తెలియకుండానే !


ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించినప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యం బాగా క్షీణించిన‌ట్లు ఇటీవ‌ల పుకార్లు వ‌చ్చాయి. ఆయ‌న ఆరోగ్య బ‌ల‌హీన‌త‌లు బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు పుతిన్ మ‌ల‌మూత్రాల‌ను బాడీగార్డ్ సేక‌రిస్తుంటాడ‌ని తెలుస్తోంది.  విదేశీ ఇంటెలిజెన్స్‌కు ఆరోగ్య ర‌హ‌స్యాలు బహిర్గతం కాకుండా పుతిన్ ఇలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు భావిస్తున్నారు. ర‌ష్యాకు చెందిన ఫెడ‌ర‌ల్ గార్డ్ స‌ర్వీస్ ప్ర‌త్యేక సూట్‌కేసును తీసుకువెళ్తుంద‌ని, ఆ సూట్‌కేస్‌లో పుతిన్ మ‌ల‌మూత్రాల‌ను తిరిగి మాస్కోకు పంపిస్తార‌ని ఓ  ఫ్రెంచ్ ప‌త్రిక కూడా పేర్కొంది. 


మరో చాప్లిన్ రావాలి, పుతిన్‌ను ప్రపంచం ప్రశ్నించాలి: కేన్స్ చలన చిత్రోత్సవంలో జెలెన్‌స్కీ


పుతిన్ ఆరోగ్యంపై రకరకాల రూమర్లు


ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ప్రారంభించిన నాటి నుంచి పుతిన్‌ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే పుతిన్‌కు కళ్లకు సంబంధించిన వ్యాధి ఉందని, మరో మూడేళ్లలో కంటి చూపు మందగించే అవకాశం ఉందనే వార్తలు చక‍్కర్లు కొట్టాయి. అంతేకాదు.. పుతిన్‌కు బ్ల‌డ్ క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు ఇటీవ‌ల‌ వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ వార్తలను ర‌ష్యా అధికారులు కొట్టిపారేస్తున్నారు. నిజమేంటో  మాత్రం ఎవరికీ తెలియదు.