Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందట. అయితే దీని నుంచి ఆయన తప్పించుకున్నారని ఉక్రెయిన్ రక్షణ నిఘా విభాగాధిపతి కైరిలో బుడనోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇది జరిగిందన్నారు.
అయితే తనపై ఐదుసార్లు హత్యాయత్నాలు జరిగినట్టు 2017లో స్వయంగా పుతిన్ ఓ సందర్భంలో అన్నారు. మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 3 నెలలు పూర్తయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఆక్రమించాలన్న వ్యూహం విఫలమవడంతో పుతిన్ రూటు మార్చారు. కనీసం తూర్పు ఉక్రెయిన్‌లో తమ అధీనంలో ఉన్న డోన్బాస్ ప్రాంతాన్నయినా పూర్తిగా చేజిక్కించుని గౌరవంగా వెనుదిరిగాలని చూస్తున్నారు. అయినా ఉక్రెయిన్ గెరిల్లా యుద్ధ తంత్రానికి రష్యా సైన్యం దీటుగా బదులివ్వలేకపోతోంది.
యుద్ధం పట్ల రష్యన్లలోనూ వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. మెక్‌డొనాల్డ్స్ వంటి రెస్టారెంట్లు మొదలుకుని పెద్ద పెద్ద కంపెనీల వరకు అన్నీ రష్యాను ఒక్కొక్కటిగా విడిచివెళ్తున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలు రష్యాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టాయని పుతిన్ కూడా అంగీకరించారు.
రష్యాకు నష్టం
ఈ సైనిక చర్య కారణంగా రష్యా.. అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిగా మారింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఆర్థికంగా బాగా దెబ్బ తింది. ఉక్రెయిన్‌ను వీలైనంత త్వరగా చేజిక్కించుకోవాలని యత్నించిన పుతిన్ సేనలకు ఉక్రెయిన్ చుక్కలు చూపించింది. పాశ్చాత్య దేశాల దన్నుతో ఉక్రెయిన్ ఇప్పటికీ దీటుగా పోరాడుతోంది. దీంతో పుతిన్ ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి.
Also Read: Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?